Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ మార్కెట్‌లో అత్యాధునిక బిస్సెల్ వెట్‌ క్లీనింగ్‌ సొల్యూషన్స్‌

wet cleaning solutions

ఐవీఆర్

, గురువారం, 24 అక్టోబరు 2024 (22:53 IST)
ఫ్లోర్‌కేర్‌ ఉత్పత్తుల్లో అంతర్జాతీయ దిగ్గజం, క్లీనింగ్ సొల్యూషన్స్‌లో అత్యంత విశ్వసనీయ సంస్థ బిస్సెల్ ఇప్పుడు భారత మార్కెట్‌లో ప్రవేశించింది. అత్యుత్తమ క్లీనింగ్స్‌ సొల్యూషన్స్‌ అందించేందుకు 148 సంవత్సరాల వారసత్వంతో కూడిన నిబద్ధత, ఆవిష్కరణలతో తన అత్యాధునిక శ్రేణి వ్యాక్యూమ్ క్లీనర్ల ద్వారా భారతదేశంలో ఇళ్ల శుభ్రతలో విప్లవాన్ని తీసుకురావడం బిస్సెల్ లక్ష్యంగా పెట్టుకుంది.
 
దేశంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ CAVITAKతో ఈ బ్రాండ్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. బిస్సెల్కున్న అంతర్జాతీయ నైపుణ్యం, CAVITAKకు ఉన్న స్థానిక మార్కెట్‌ పరిజ్ఞానం భారతీయ వినియోగదారులకు సమగ్ర పంపిణీ, సపోర్టు, సేవలు అందేలా చూస్తాయి. భారతదేశంలో ప్రవేశపెట్టిన బిస్సెల్ ఉత్పత్తులు ఇప్పుడు ప్రత్యేకంగా Amazon.inలో అందుబాటులో ఉన్నాయి. త్వరలో Flipkartలోనూ లభించనున్నాయి. విస్తరణలో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌ క్రోమా, రిలయన్స్ డిజిటల్‌, విజయ్‌ సేల్స్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా భారత్‌లో కంపెనీ అడుగుపెట్టింది
 
పోర్టబుల్‌ వెట్‌ & డ్రై డీప్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్‌- సోఫా, కార్పెట్స్‌, పరుపులపై పడ్డ కూర మరకలు తొలగించేలా ఇది డిజైన్ చేయబడింది. ఇది కర్టెన్లు, కార్‌ ఇంటీరియర్స్‌నూ శుభ్రం చేస్తుంది. దుస్తులను తాజాగా ఉంచుతుంది. ఇంకా ఎన్నో చేస్తుంది. క్రాస్‌వేవ్‌ అప్‌రైట్‌ 3-ఇన్‌-1 వెట్‌ & డ్రై వ్యాక్యూమ్‌ క్లీనర్‌- బిస్సెల్ విప్లవాత్మక బహుళ ఉపరితల వ్యాక్యూమ్ క్లీనర్‌. ఒక బటన్‌ నొక్కడం ద్వారా ఇది కఠినమైన ఫ్లోర్లు, కార్పెట్లను ఏకకాలంలో కడుగుతుంది, వ్యాక్యూమ్ చేస్తుంది, పొడిగానూ మార్చుతుంది.
 
ఈ రెండు సృజనాత్మక ఉత్పత్తులు భారతీయ వినియోగదారులకు అధిక పనితీరుతో పాటు విలువనూ అందిస్తాయి. బిస్సెల్ ఉత్పత్తులు పెంపుడు జంతువులకు అనుకూలంగా ఉంటాయి. పెంపుడు జంతువుల యజమానులు తమ ఇళ్లను జంతువుల జుట్టు, డాండర్‌, వాసనరహితంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకమైన డిజైన్‌తో కూడా ఉత్పత్తుల శ్రేణి కూడా ఉంది. ఈ వైవిధ్యభరితమైన పోర్టబుల్‌ వెట్‌ - డ్రై డీప్‌ వ్యాకూమ్‌ క్లీనర్లు భారతీయ గృహల విస్త్రృత శ్రేణి శుభ్రత పనులకు సరిగ్గా సరిపోతాయి. వీటిలోని శక్తిమంతమైన సక్షన్‌, ప్రత్యేకమైన అటాచ్‌మెంట్స్‌ కూర మరకలు, మురికి, దుమ్ము, కార్పెట్స్‌, అప్‌హోల్‌స్ట్రీ, ఇతర ఉపరితలాలపై పేరుకునే అలర్జెన్లు ఎటువంటి శ్రమ లేకుండా సునాయాసంగా తొలగిస్తాయి. కాంప్యాక్ట్‌, తేలిక బరువు డిజైన్‌ కారణంగా దీన్ని ఇంట్లో ఎక్కడైనా, ఇరుకు ప్రదేశాల్లోనూ సులభంగా ఉపయోగించవచ్చు.
 
ఈ సందర్భంగా బిస్సెల్ హోమ్‌కేర్‌ ఇన్‌క్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ప్రెసిడెంట్‌ మ్యాక్స్ బిసెల్‌ మాట్లాడుతూ,” భారతీయ గృహాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన శుభ్రపరిచే పరిష్కారాలు అందిస్తూ ఈ డైనమిక్ మార్కెట్‌కు బిస్సెల్ని పరిచయం చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది.మా వెట్‌ క్లీనింగ్‌ ఉత్పత్తులు ఆధునిక సౌలభ్యం, సామర్థ్యంతో సాంప్రదాయ శుభ్రపరిచే విలువలను చక్కగా మిళితం చేస్తాయి. ఆవిష్కరణలు, క్లీనింగ్‌  సొల్యుషన్స్‌పై మా నిబద్ధత  పరిశుభ్రమైన,ఆరోగ్యకరమైన జీవనశైలికి కోసం భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశంలో మా సరికొత్త ఉత్పత్తుల శ్రేణితో భారతీయ వినియోగదారుల అవసరాలు, ఆకాంక్షలకు సరిపోయే శుభ్రపరిచే పరిష్కారాలు అందించగలమన్న విశ్వాసం మాకు ఉంది" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై సీఐ అత్యాచార యత్నం, పరారీలో పోలీసు అధికారి