Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘కస్టమర్ కేర్ మహోత్సవ్’ను ప్రారంభించిన టాటా మోటార్స్

TATA care

ఐవీఆర్

, బుధవారం, 23 అక్టోబరు 2024 (19:01 IST)
వాణిజ్య వాహన వినియోగదారుల కోసం సమగ్ర కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అయిన ‘కస్టమర్ కేర్ మహోత్సవ్ 2024’ను ప్రారంభించినట్లు భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్రకటిం చింది. ఈ కార్యక్రమం  2024 డిసెంబర్ 24 వరకు నిర్వహించబడనుంది. ప్రత్యేకమైన, విలువను పెంచే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 2500కి పైగా అధీకృత సర్వీస్ అవుట్‌లెట్‌లలో నిర్వహించబడనుంది. ఫ్లీట్ ఓనర్లు, డ్రైవర్‌లను కలిసి వారితో సంభాషించేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

ఈ మహోత్సవ్ ద్వారా కస్టమర్లు శిక్షణ పొందిన సాంకేతిక నిపు ణులచే సంపూర్ణమైన వాహన తనిఖీలు చేయించుకోవచ్చు. విలువ ఆధారిత సేవలను పొందవచ్చు. ఇంకా మరెన్నో ప్రయోజనా లను పొందవచ్చు. అంతేగాకుండా డ్రైవర్లు సంస్థ సంపూర్ణ సేవా 2.0 కార్యక్రమం కింద తగిన ఆఫర్‌లతో పాటు సురక్షిత, ఇంధన-సమర్థవంత  డ్రైవింగ్ పద్ధతులపై విస్తృత శిక్షణ పొందుతారు.
 
కస్టమర్ కేర్ మహోత్సవ్ 2024 ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా  టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఘ్ మాట్లా డుతూ, ‘‘కస్టమర్ కేర్ మహోత్సవ్‌ను తిరిగి తీసుకుతీసుకువస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరం అక్టోబర్ 23న ఇది  ప్రారంభమవుతుంది. మేం మా మొదటి వాణిజ్య వాహనాన్ని 1954లో ఇదే రోజున విక్రయించినందున ఈ రోజు మాకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇప్పుడు మేం దానిని కస్టమర్ కేర్ డేగా నిర్వహించుకుంటున్నాం.
 
కచ్చితత్వంతో కూడిన వాహన తనిఖీల ద్వారా మరియు అనేక రకాల ప్రయోజనాలను అందించడం ద్వారా అత్యుత్తమ-తరగతి సేవను అందించాలనే మా నిబద్ధతను ఈ మహోత్సవ్ ప్రతిబింబిస్తుంది. మహోత్సవ్ దేశంలోని ప్రతి టచ్‌పాయింట్‌లో మా కొనుగోలుదారులను ఆహ్లాద పరిచేలా చేయడం  ద్వారా, మా వాటాదారులందరితోనూ మా సంబంధాలను బలోపేతం చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మా కస్టమర్లందరినీ వారి సమీప టాటా అధీకృత సేవా కేంద్రాలకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం వారి వ్యాపా రాలకు గణనీయమైన విలువను జోడిస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వయనాడ్ లోక్‌సభ బైపోల్ : నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంకా గాంధీ