Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయులు తమ పర్ఫెక్ట్ మ్యాచ్‌ కోసం జీవన్‌సతి 'ఫ్రీ చాట్' ఫీచర్‌ పరిచయం

Image
, శనివారం, 7 మే 2022 (17:25 IST)
భారతదేశపు ప్రముఖ మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారమ్, జీవన్‌సతి.కామ్ భారతీయ వినియోగదారుల 'ఫ్రీ చాట్' ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కేటగిరీ-మొదటి ఫీచర్ లక్షలాది మంది భారతీయులు వారికి సరిపోలిన ప్రొఫైల్‌లతో వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది, ఆ విధంగా వారు తమకి సరైన భాగస్వామిని తెలుసుకోవడంలో సరైన విధంగా సహాయం పొందుతారు.

 
జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ఒక పెద్ద మరియు ఎంతో ముఖ్యమైన నిర్ణయం. అయితే, సాంప్రదాయకంగా అన్ని భారతీయ ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లలో, మరొక ప్రొఫైల్‌తో పరిచయాన్ని ప్రారంభించడానికి సబ్‌స్క్రిప్షన్ చెల్లించవలసి ఉంటుంది. అందువలన, వినియోగదారులకు వారికి సరిపోయే మ్యాచ్‌లను తెలుసుకునే గొప్ప అవకాశాన్ని అందించాలని, జీవన్‌సతి ఈ కొత్త ప్రత్యేక ఫీచర్‌ను పరిచయం చేసింది.


ఇప్పుడు, జీవన్‌సతిలోని ఏ వినియోగదారుడయినా వారు సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులు చేశారా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా మరొక వినియోగదారుతో చాట్‌లను ప్రారంభించవచ్చును. ఫ్రీ చాట్ ఫీచర్ పరస్పర పరిచయాలని సులభతరం చేయడానికి మంచి అవకాశాన్ని కలిగిస్తుంది, వినియోగదారుడు మ్యాచ్‌తో పాటు ప్లాట్‌ఫారమ్‌లోని ఆఫర్‌లను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

 
ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభిస్తూ జీవన్‌సతి బిజినెస్ హెడ్ రోహన్ మాథుర్ మాట్లాడుతూ, “మహమ్మారి కారణంగా, భారతీయులు తమ జీవిత భాగస్వాములను తెలుసుకోవడానికి డిజిటల్ మార్గాన్ని అనుసరించారు, ఎందుకంటే ఈ విధానంలో ఎటువంటి భయాలు లేకుండా కనెక్ట్ అవ్వడానికి జీవన్‌సతి వీలు కల్పించింది.

 
ఇప్పుడు ప్రజాజీవితం సాధారణ స్థితికి వస్తున్నందున, వినియోగదారులు గతంలో కంటే కూడా మెరుగైన సౌకర్యాలను అందించే ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారమ్‌లను చూస్తున్నారు. మా కొత్త ఫ్రీ చాట్ ఫీచర్‌తో, భారతీయులు ఏ విధమయిన ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా పరస్పరం వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాము, అందువలన చక్కని మెరుగైన మ్యాచ్‌మేకింగ్ ఆనందాలు, మరిన్ని విజయవంతమైన కథనాలు మన మధ్యవర్తిత్వం మీద నమ్మకాన్ని పెంచుతాయి."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి రోజా భేటీ..