Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

CRC ది ఫ్లాగ్‌షిప్ నుంచి 56 ఎలివేటర్లు, ఎస్కలేటర్‌ల కోసం ఆర్డర్‌ని అందుకున్న హిటాచీ

image

ఐవీఆర్

, గురువారం, 17 అక్టోబరు 2024 (22:54 IST)
భారతదేశంలో ఎలివేటర్లు మరియు ఎస్కలేటర్‌ల విక్రయాలు, ఇన్‌స్టాలేషన్ మరియు నిర్వహణ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న హిటాచీ యొక్క అనుబంధ సంస్థ, హిటాచీ బిల్డింగ్ సిస్టమ్స్, హిటాచీ లిఫ్ట్ ఇండియా, భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో వున్న CRC ది ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్ కోసం CRC గ్రూప్ నుండి 56 యూనిట్ల ఎలివేటర్లు, ఎస్కలేటర్‌ల కోసం విజయవంతంగా ఆర్డర్‌ను పొందినట్లు ఈరోజు హిటాచీ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ నోయిడాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ప్రాజెక్టులలో ఒకటి.
 
ఈ ఆర్డర్‌లో 180 లేదా 150 మీ/నిమిషాల వేగంతో కూడిన హై-స్పీడ్ ఎలివేటర్లు సహా 44 ఎలివేటర్‌లు, 12 ఎస్కలేటర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఎలివేటర్ కార్లను సమర్ధవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చే డెస్టినేషన్ ఫ్లోర్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా భాగంగా వుంది. ఈ ఎలివేటర్‌లలో భూకంప సమయాలలో పనిచేసే అత్యవసర నిర్వహణ వ్యవస్థ కూడా ఉంది, ఇది భూకంపాన్ని గుర్తించి, ఎలివేటర్‌ను దగ్గరగా ఉన్న అంతస్తులో వెంటనే  ఆపివేస్తుంది, తద్వారా ప్రయాణికులు అందులో చిక్కుకోకుండా బయటికి రావచ్చు. ఈ ఫీచర్లు వినియోగదారులకు భద్రత, రక్షణ మరియు సౌకర్యాన్ని అందిస్తాయి.
 
అని హిటాచీ లిఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మసాయా సకాకిబారా అన్నారు, “నోయిడా జిల్లా కోసం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావటం మాకు గౌరవంగా ఉంది. మా అధిక-నాణ్యత ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా వినియోగదారులందరికీ, నగర అభివృద్ధికి సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణాకు సహకరించడం మా లక్ష్యం. భారతదేశ సమాజం మరియు దాని ప్రజల శ్రేయస్సు కోసం మేము కట్టుబడి ఉంటాము. ”
 
హిటాచీ లిమిటెడ్ కార్పోరేట్ ఆఫీసర్- హిటాచీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ భరత్ కౌశల్ గారు మాట్లాడుతూ, “తొమ్మిది దశాబ్దాలకు పైగా భారత్‌తో హిటాచీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇకపై హిటాచీ ఇండియా) అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్యం అపూర్వమైన వేగంతో పురోగమిస్తోంది. భారతదేశం తమ ప్రజలకు సాధికారత కల్పించడమే కాకుండా, బిలియన్ల మందికి జీవన నాణ్యతను పెంచడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారడానికి తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నది, "హిటాచీ లిఫ్ట్ ఇండియా భారతదేశ పరివర్తన ప్రయాణంలో ఒక సమగ్ర భాగస్వామిగా నిలిచింది.
 
CRC గ్రూప్ దేశం యొక్క స్థిరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించింది. భారతదేశంలో పట్టణ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి మా నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచించే CRC గ్రూప్‌తో కలిసి పనిచేయటానికి మేము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం రెండు ప్రముఖ సంస్థల మధ్య వ్యూహాత్మక సమలేఖనానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, భారతదేశం అసమానమైన నిర్మాణ ప్రమాణాలను నెలకొల్పడానికి, స్థిరమైన సమాజాన్ని నిర్మించడానికై  ఒక పెద్ద ముందడుగు వేస్తుందని నిర్ధారించడంలో ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత యొక్క మా భాగస్వామ్య దృష్టిని కూడా నొక్కి చెబుతుంది. అర్బన్ మొబిలిటీ, ఎనర్జీ, ఐటి, చెల్లింపులు, ఇ-ఎడ్యుకేషన్ మరియు ఇ-హెల్త్‌కేర్‌తో సహా మా ఆదర్శప్రాయమైన ఇంకా విభిన్న పరిష్కారాలతో, హిటాచీ ఇండియా పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ప్రతిష్టాత్మకమైన మరియు ప్రగతిశీల దృక్పథాన్ని కలిగి ఉంది.." అని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం ద్వారా, ప్రీమియం మార్కెట్‌లో తమ కార్యకలాపాలను పెంపొందించుకోవాలని మరియు భారతదేశంలో మరింతగా వ్యాపారాభివృద్ధికి కట్టుబడి ఉండాలని హిటాచీ లిఫ్ట్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ