గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్త లీడర్‌గా ఉన్నటువంటి సంస్థ హయర్. 14 ఏళ్ల నుంచి మేజర్ అప్లయెన్సెస్‌లో ప్రపంచంలోనే నంబర్ 1 బ్రాండ్ అయిన హయర్.. భారతదేశంలో కినౌచి 5 స్టార్ హెవీ-డ్యూటీ ప్రో ఎయిర్ కండీషనర్ సిరీస్‌ను ప్రారంభించినట్లు ఇవాళ ప్రకటించింది. కినౌచి ఏసీ సిరీస్ సూపర్ కూలింగ్ ఫీచర్‌తో శక్తిమంతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న ఫీచర్స్... ఇంటెల్లి స్మార్ట్, హైయర్ స్మార్ట్ యాప్‌తో కంఫర్ట్ కంట్రోల్‌ని అందించడానికి ఉపయోగపడుతుంది.
భారతీయ వినియోగదారుల కోసం వినూత్న ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో హయర్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇదే వారి ప్రధాన లక్ష్యం. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి బ్రాండ్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో స్థానిక తయారీ ద్వారా ప్రీమియం ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంపై హయర్ తన దృష్టిని బలోపేతం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న హయర్ యొక్క అత్యాధునిక కర్మాగారం, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రీమియం, హై-ఎండ్ ఉత్పత్తులతో ఆవిష్కరింపబడేలా బ్రాండ్‌ను అభివృద్ధి చేయడం కొనసాగించింది.
ఈ సందర్భంగా హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సతీష్ ఎన్ఎస్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “హయర్‌లో, మా వినియోగదారుల జీవితాన్ని సులభతరం, మరింత సౌకర్యవంతంగా చేసే వినూత్న సాంకేతికతలతో కూడిన ఉత్పత్తులను రూపొందించాలని మేము విశ్వసిస్తున్నాము. భారతదేశం తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా వేసవి కాలం ఎక్కువ ఎండ ఉంటుంది. ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మేము కొత్త శ్రేణి కినౌచి 5 స్టార్ హెవీ-డ్యూటీ ఎయిర్ కండీషనర్ సిరీస్‌ను విడుదల చేసాము. ఇది విపరీతమైన ఉష్ణోగ్రతలలో మీకు కావాల్సిన కూలింగ్‌ను అందిస్తుంది. సౌకర్యం, విశ్వసనీయత, పనితీరును పెంచడానికి ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో ఖర్చు సామర్థ్యాన్ని కూడా చూసుకుంటుంది.
అంతేకాకుండా "భారతదేశంలో ఎయిర్ కండిషనర్ల కోసం వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి మరియు సహాయం చేయడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము, 2023లో రెండంకెల వృద్ధి పథాన్ని సాధించగలమని మేము విశ్వసిస్తున్నాము" అని ఆయన అన్నారు. భారతీయ గృహాలకు అంతిమ సౌకర్యాన్ని అందించే ప్రయత్నంలో, హయర్ కినౌచి హెవీ-డ్యూటీ ప్రో ఎయిర్ కండీషనర్ సిరీస్‌లో ఆవిష్కరణ, డిజైన్, శక్తి నైపుణ్యాల యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని మిళితం చేసింది. అత్యాధునిక సాంకేతికతతో తమ జీవనశైలిని అప్‌గ్రేడ్ చేయాలనుకునే వినియోగదారులు ఇక చూడాల్సిన అవసరం లేదు.
ఈ సందర్భంగా హయర్ అప్లయెన్సెస్ ఇండియా డైరెక్టర్-ఎయిర్ కండీషనర్ బిజినెస్ శ్రీ షాఫీ మెహతా మాట్లాడారు. “హయర్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడంపై మా దృష్టి ఉంది. కినౌచి 5 స్టార్ హెవీ - డ్యూటీ ప్రో ఎయిర్ కండీషనర్ సిరీస్ అనేది సౌకర్యాన్ని అందించడమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్న స్మార్ట్ ఉపకరణాల కోసం వెతుకుతున్న వినియోగదారులకు సరైన ఏసీ. ఇంటెల్లి స్మార్ట్ ఫీచర్లతో కూడిన సూపర్ కూలింగ్ ఫీచర్ మరియు కంఫర్ట్ కంట్రోల్ మరియు కినౌచి AC సిరీస్ యొక్క హైయర్ స్మార్ట్ యాప్ వినియోగదారులు వెతుకుతున్న తదుపరి అప్‌గ్రేడ్ కు పర్ ఫెక్ట్ గా సరిపోతుంది అని అన్నారు.