Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాయిస్‌ కంట్రోల్‌ ఫ్రండ్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ విడుదల చేసిన హయర్‌

Advertiesment
HAIER
, మంగళవారం, 11 అక్టోబరు 2022 (21:30 IST)
హోమ్‌ అప్లయెన్సస్‌, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో అంతర్జాతీయంగా అగ్రగామి, గత 13 సంవత్సరాలుగా మేజర్‌ అప్లయెన్సస్‌లో ప్రపంచంలో నెంబర్‌ 1 బ్రాండ్‌‌గా వెలుగొందుతున్న హయర్‌ నేడు తమ నూతన ఏఐ ఆధారిత విప్లవాత్మక వాషింగ్‌ మెషీన్‌ సిరీస్‌ హయర్‌ 979 ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌లను అత్యాధునిక సూపర్‌ సైలెంట్‌ డైరెక్ట్‌ మోషన్‌ మోటర్‌, 52.5 సెంటీమీటర్ల సూపర్‌ డ్రమ్‌తో విడుదల చేసింది. హయర్‌ యొక్క  మేడ్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఫర్‌ ఇండియా లక్ష్యంకు అనుగుణంగా  ఈ కంపెనీ భవిష్యత్‌ సిద్ధమైన స్మార్ట్‌ హోమ్‌, ఏఐ, ఐఓటీ ఆధారిత లాండ్రీ పరిష్కారాలను ప్రీమియం వాష్‌, ఫ్యాబ్రిక్‌ కేర్‌ కోసం నూతన తరపు సాంకేతికతలతో అందిస్తుంది. ఫ్రంట్‌ లైన్‌ ఆవిష్కరణలను కూడిన ఈ సూపర్‌ డ్రమ్‌ 979 సిరీస్‌ డైరెక్ట్‌ మోషన్‌ మోటర్‌ కలిగి ఉండటంతో పాటుగా కేవలం వాయిస్‌ కమాండ్‌తో దీనిని వినియోగించవచ్చు.
 
నూతన శ్రేణి వాషింగ్‌ మెషీన్‌ల విడుదల గురించి హయర్‌ అప్లయెన్సస్‌ అధ్యక్షులు శ్రీ సతీష్‌ ఎన్‌ఎస్‌ మాట్లాడుతూ, ‘‘హయర్‌ వద్ద మేము వినియోగదారుల  సౌకర్యంకు కట్టుబడి ఉన్నాము. ప్రతి రోజూ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే ఆవిష్కరణలను పంచుకోవడానికి స్ఫూర్తిని పొందుతూనే ఉన్నాము. మా నూతన ఐఓటీ ఆధారిత ఫ్రంట్‌ లోడ్‌ సూపర్‌ డ్రమ్‌ 979 సిరీస్‌ వాషింగ్‌ మెషీన్‌ విప్లవాత్మక ఆవిష్కరణ. ఇది అత్యాధునిక ఏఐపై ఆధారపడటంతో పాటుగా అతి సులభమైన, తెలివైన, వ్యక్తిగతీకరించిన లాండ్రీ పరిష్కారాలను వినియోగదారులకు అందిస్తుంది. ఈ నూతన శ్రేణి మరింతగా వినియోగదారుల జీవనశైలి పెంచడంతో పాటుగా దేశవ్యాప్తంగా  ఎక్కువ మంది ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘ వినియోగదారుల జీవితానికి స్ఫూర్తి కలిగించే అవకాశం ఈ పండుగ సీజన్‌ మాకు కలిగించింది. వాషింగ్‌ మెషీన్‌ విభాగంలో మా మార్కెట్‌ వాటాను 5% పెంచనుందని భావిస్తున్నాము. మా భావితరపు ఐఓటీ ఆధారిత ఉత్పత్తి సిరీస్‌ దీనికి తోడ్పడనుంది.ఈ నూతన ప్రొడక్ట్‌ లైనప్‌ అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లతో ఉంది. ఈ వేడుకలలో భాగం కావడం సంతోషంగా ఉంది మరియు ఈ పండుగ సీజన్‌లో వారికి మహోన్నత స్ఫూర్తినీ అందించనున్నాము’’అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాడ్జీలో వ్యభిచారం: ఐదుగురి అరెస్ట్.. ఎక్కడ?