చండీగఢ్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జీఎస్టీ కౌన్సిల్ (జీఎస్టీ మండలి) సమావేశం జరుగనుంది. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు వస్తువులపై వసూలు చేస్తున్న పన్ను శ్లాబుల్లో మార్పులు చేయనున్నారు. మరికొన్ని వస్తువులకు తగ్గించనున్నారు.
అలాగే పలు రాష్ట్రాలకు పరిహారంతో పాటు రిజిస్ట్రేషన్ నిబంధనల్లో సడలింపులు వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. సెస్ వసూళ్ళలో తగ్గుదల కారణంగా రాష్ట్రాల నష్టపరిహారం లోటును తీర్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లను రుణం తీసుకుంది.
లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ సమావేశంలో రెవెన్యూ లోటుకు రాష్ట్రాలను పరిహారం ఇచ్చే విధానంలో జూన్ 2022లో ముగుస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, పలు వస్తువులపై పన్ను శాతాన్ని 18 శాతానికి పెంచే అవకాశం ఉంది.