Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-06-2022 సోమవారం రాశిఫలాలు ... ఉమాపతిని ఆరాధించిన శుభం...

Advertiesment
astro10
, సోమవారం, 27 జూన్ 2022 (04:01 IST)
మేషం :- గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. అనవసరపు విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిలవసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృషభం :- ప్రభుత్వ కార్యాయాల్లో పనులు అనుకూలిస్తాయి. క్యాటరింగ్, స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రయాణాల్లో మెలకువ వహించండి.
 
మిథునం :- బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం :- రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వైద్యులకు పేరు, ఖ్యాతి లభిస్తాయి. ఓ చక్కని వ్యక్తి సాహచర్యం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎల్.ఐ.సి. పోస్టల్ ఏజెంట్లకు శ్రమ, త్రిప్పట అధికం. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి.
 
సింహం :- ఆలయాలను సందర్శిస్తారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ వాహనం ఇతరులకివ్వటం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసి వస్తుంది. ఆప్తుల కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖుల కోసం వేచియుండక తప్పదు. భాగస్వామ్యుల మధ్య అవరోధాలు తలెత్తిన నెమ్మదిగా పరిష్కరిస్తారు.
 
కన్య :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు.
 
తుల :- బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం, చికాకులను ఎదుర్కుంటారు. మిత్రుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. చిన్నపాటి ఆనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవల్సి వస్తుంది. రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయి పెరుగగలదు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించటం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఉద్యోగం చేయు స్త్రీలకు దూరప్రాంతాలకు బదిలీలు అవుతాయి.
 
ధనస్సు :- స్త్రీల వాక్చాతుర్యమునకు మంచి గుర్తింపు లభిస్తుంది. అసలైన శక్తి సామర్థ్యన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. కోళ్ళ, గొర్రెలు, మత్స్య వ్యాపారస్తులకు ఆందోళన, చికాకులు తప్పవు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు.
 
మకరం :- శ్రమపడినా ఫలితం దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ మనోభావాలు నెరవేరే సమయం ఆసన్నమైంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి.
 
కుంభం :- ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రింటింగ్ రంగాలవారు అచ్చుతప్పులు పడుట వలన మాటపడవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. ముఖ్యుల గురించి ధనం వెచ్చిస్తారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.
 
మీనం :- ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలు అందరియందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. ఎవరికైన ధన సహాయం చేసినా ధనం తిరిగి రాజాలదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-06-2022 ఆదివారం రాశిఫలాలు ... సూర్య నారాయణ పారాయణ చేసినా...