Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-06-2022 శుక్రవారం రాశిఫలాలు ... శ్రీమహాలక్ష్మిని పూజించినా శుభం జయం...

Advertiesment
Astrology
, శుక్రవారం, 24 జూన్ 2022 (04:00 IST)
మేషం :- స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు అకాల భోజనం వలన ఆర్యోగంలో చికాకులు తప్పవు.
 
వృషభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
మిథునం :- సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి.
 
కర్కాటకం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.
 
సింహం :- మీలోని బలహీనతలను తొలగించుకోవటంపై దృష్టి పెడతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఎవరికైనా ధన సహాయంచేసినా తిరిగిరాజాలదు.
 
కన్య :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి, స్త్రీలు అందరియందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పాత మొండిబాకీలు వసూలవుతాయి. చిన్నపాటి ఆనారోగ్యానికిగురై చికిత్స తీసుకోవల్సి వస్తుంది. ఉద్యోగస్తులు తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. గృహ మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి.
 
వృశ్చికం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు :- మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఏసీ కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
మకరం :- బంధు మిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది.
 
కుంభం :- సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. రిప్రజెంటేటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులు వంటివి తప్పవు.
 
మీనం :- వాతావరణంలోని మార్పు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. శత్రువుల కూడా మిత్రులుగా మారతారు. మిర్చి, నూనె, పసుపు, చింతపండు స్టాకిస్టులకు. రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుండి ధన, వస్తు సహాయం ఆశించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-06-2022 గురువారం రాశిఫలాలు ... సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం...