దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని 24 క్యారెట్ల బంగారం పది గ్రామాలు ధర రూ.51,050గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర పది గ్రాములు రూ.67,400కు చేరుకుంది.
గత యేడాది నవంబరు నెల తర్వాత ఇంత భారీ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా, భవిష్యత్‌లో కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ళ సీజనే అని వారు చెబుతున్నారు.