Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లను పరిచయం చేసిన బోచ్

Semi-Automatic Washing Machine

ఐవీఆర్

, శుక్రవారం, 17 మే 2024 (22:11 IST)
గృహోపకరణాల పరిశ్రమలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన BSH Hausgerate GmbH అనుబంధ సంస్థ BSH హోమ్ అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయుల యొక్క దుస్తుల శుభ్రత అవసరాలను తీర్చడానికి అత్యంత ఖచ్ఛితత్త్వంతో రూపొందించబడిన, 'మేడ్-ఇన్-ఇండియా' సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల యొక్క సరికొత్త శ్రేణిని పరిచయం చేసింది. వినియోగదారు-కేంద్రీకృతత, మేక్ ఇన్ ఇండియా యొక్క నైతికత పట్ల అచంచలమైన నిబద్ధతతో, అసమానమైన లాండ్రీ అనుభవాన్ని Bosch అందజేస్తుంది. అత్యుత్తమ ఫాబ్రిక్ కేర్, సౌకర్యాన్ని లైక్ ఎ బోచ్‌గా అందిస్తుంది. నాణ్యత, డిజైన్ పరంగా జర్మన్ ప్రమాణాలతో సరిసమానంగా తయారు చేయబడిన ఈ వాషింగ్ మెషీన్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్వసనీయత, పనితీరును నిర్ధారిస్తాయి.
 
ఈ ఆవిష్కరణపై BSH అప్లయెన్సెస్ ఎండి & సీఈఓ సైఫ్ ఖాన్ మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల యొక్క కొత్త శ్రేణిని పరిచయం చేయడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ఆవిష్కరణతో, లాండ్రీ విభాగంలో మా  కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటుగా భారతీయ వినియోగదారులకు ఫాబ్రిక్ కేర్ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నాము. వినియోగదారు-కేంద్రీకృత ఆవిష్కరణల ద్వారా రోజువారీ జీవితాన్ని మెరుగుపరచడానికి  BSH అప్లయెన్సెస్ వద్ద మేము అంకితభావంతో కృషి చేస్తున్నాము. 'మేక్ ఇన్ ఇండియా'పై దృష్టి సారించి, మా ఉత్పత్తుల యొక్క ప్రతి ఫీచర్ భారతీయ గృహాల యొక్క విభిన్న అవసరాలకు అనుగుణంగా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు