ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.46,715 సాయం (క్రెడిట్) పొందొచ్చంటూ మీకు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. ఈ తరహా నకిలీ మెసేజ్‍లతో సెంటర్ మోసగాళ్ల మిమ్మల్ని తప్పదోవపట్టించి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే దుష్ట పన్నాగమని గ్రహించండి.
ప్రజలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుండటంతో ఆ తీవ్రతను తగ్గించేందుకు ప్రతి పౌరుడుకీ రూ.46,715 సాయంగా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని, రిజిస్టర్ చేసుకోవాలంటూ వాట్సాప్‌లో జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇది ఓ స్కామ్ అని, అలాంటి స్కామ్ ఏదీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఆ తరహా లింక్‌లపై క్లిక్ చేయొద్దని, ఎవరికీ షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సైబర్ మాయగాళ్ళ వలకు చిక్కి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది.