Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబరులో బ్యాంకులకు సెలవుల జాతరే జాతర

Advertiesment
rbi logo

ఠాగూర్

, శుక్రవారం, 29 ఆగస్టు 2025 (16:54 IST)
2025 సంవత్సరం సెప్టెంబరు నెలలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఈ నెలలో కేవలం సగం రోజులే బ్యాంకులు పని చేయనున్నాయి. ఈ నెలలో పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 14రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు కలిసి ఉండనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసి సెలవులు క్యాలెండర్‌లో వెల్లడించింది. అయితే, ఈ సెవులన్నీ అన్ని రాష్ట్రాలకు వర్తింవచనే విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు గుర్తించాలని సూచన చేసింది. 
 
సెప్టెంబరు నెలలో పండగలు, ఇతర ప్రత్యేక రోజులు కారణంగా మొత్తం 9 రోజులను ఆర్బీఐ సెలవులుగా ప్రకటించింది. వీటికి అదనంబా ైదు వారాంతపు సెలవులు (ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు) ఉన్నాయి. దీంతో మొత్తం సెలవులు సంఖ్య 14కు చేరింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు కేరళలో ఓనం పండుగకు ఇచ్చే ఇతర రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి, బ్యాంకులకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని సెలవుల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. 
 
ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సెప్టెంబరు 5న శుక్రవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కర్మపూజ (జార్ఖండ్), ఇంద్రజాత్త (సిక్కిం), నవరాత్రి స్థాపన (రాజస్థాన్), దుర్గపూజ (బెంగాల్, అస్సోం, త్రిపుర) వంటి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 
 
కాగా, సెప్టెంబరు నెలలో 7, 14, 21, 28వ తేదీల్లో వారాంతపు సెలవులు రానున్నాయి. సెప్టెంబరు 13వ తేదీ రెండో శనివారం, 27వ తేదీన నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవు. అయితే, ఇంటర్నెట్, ఆన్‌లైన్, మొబైల్, ఏటీఎం సేవలు మాత్రం 24*7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు 7న రక్త చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుంది...