Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆక్సియో సేకరణను పూర్తి చేసిన అమేజాన్, ఇక బై నౌ పే లేటర్

Advertiesment
Amazon

ఐవీఆర్

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (22:58 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుండి నియంత్రణా ఆమోదం పొందిన తరువాత భారతదేశంలో ప్రముఖ డిజిటల్ లెండింగ్, చెక్అవుట్ ఫైనాన్స్ ప్రొవైడర్ ఆక్సియో (ఇంతకుముందు కాపిటల్ ఫ్లోట్) సేకరణ పూర్తయ్యిందని అమేజాన్ ప్రకటించింది. భారతదేశంలో అమేజాన్ వారి అతి పెద్ద సేకరణలో ఒకటిగా నిలిచిన ఈ సేకరణ భారతదేశంలతో తమ ఆర్థిక సేవల ఆఫరింగ్స్ విస్తరణకు అమేజాన్ వారి నిబద్ధతలో ఒక మైలురాయి. ఇది ఆక్సియోతో అమేజాన్ వారి ప్రస్తుత భాగస్వామ్యంపై రూపొందించబడింది, ఇది ఆరేళ్లకు పైగా భారతదేశంలో అమేజాన్ పే కోసం బై నౌ పే లేటర్ సేవలను సమర్థిస్తోంది.
 
ఆరుగురు భారతదేశపు కస్టమర్లలో ఒకరికి మాత్రమే చెక్అవుట్ ఫైనాన్సింగ్ అందుబాటులో ఉంది, రుణం పొందడానికి అవకాశం పెరగడం అమేజాన్‌కు ఒక ప్రాధమికమైన ప్రాధాన్యత అని మహేంద్ర నెరుకర్ VP, పేమెంట్స్ అమేజాన్ అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా, ఆక్సియోతో మా భాగస్వామం 10 మిలియన్లకు పైగా కస్టమర్ల కోసం రుణాన్ని అందచేయడానికి వీలు కల్పించింది. అమేజాన్ వారి పరిధి, టెక్నాలజీ అవగాహన, బ్యాంక్ సంబంధాలతో కలిసి రాబోయే సంవత్సరాల్లో లక్షలాదిమంది కస్టమర్లకు, చిన్న వ్యాపారాలకు బాధ్యతాయుతమైన రుణాలను విస్తరించడంలో మాకు సహాయపడుతుంది.
 
ఆక్సియో ఈరోజు వరకు 10 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించింది, అమేజాన్ యొక్క అనుబంధ సంస్ధగా సమీకృతమవుతూనే ప్రస్తుత నాయకత్వ టీం ద్వారా ఆపరేట్ చేయడం కొనసాగిస్తుంది. అమేజాన్‌తో కలిసి ఉమ్మడి ప్రయత్నాలు ఆక్సియోకు ఒక ఉత్సాహవంతమైన కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది అని ఆక్సియోలో శశాంక్ రిష్యశృంగ & గౌరవ్ హిందూజా, సహ-స్థాపకులు అన్నారు.
 
ఈ సంబంధం క్రెడిట్ యాక్సెస్‌ను విస్తరించడానికి మా మిషన్‌ను వేగవంతం చేయడానికి అనుమతిస్తుంది. అమేజాన్ చేరిక, కస్టమర్ కేంద్రీకృతం, బ్యాలెన్స్ షీట్ విస్తృతితో, డిజిటల్ లెండింగ్‌ను తదుపరి 100 మిలియన్ భారతీయుల వద్దకు పెద్ద ఎత్తున తీసుకువెళ్లే బాధ్యతకు మేము ఉత్తమమైన స్థానంలో ఉన్నాము. ఈ సేకరణ అమేజాన్ పే లేటర్ చెక్ అవుట్ ఫైనాన్స్, టెర్మ్ లోన్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని, భారతదేశంవ్యాప్తంగా ప్రత్యేకించి సేవలు అందని ప్రాంతాల్లో డిజిటల్ లెండింగ్ సేవల్లో ఆవిష్కరణ కోసం కొత్త అవకాశాలను కల్పిస్తుందని ఆశించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ సీజన్‌కు సరైన సమయంలో స్విగ్గీ గిఫ్టబుల్స్ ప్రారంభం