Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Advertiesment
Nishanchi Trailer poster

దేవీ

, బుధవారం, 3 సెప్టెంబరు 2025 (15:56 IST)
Nishanchi Trailer poster
అమెజాన్ MGM స్టూడియో ఇండియా తన రాబోయే నిశాంచి ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మాణంలో, ఫ్లిప్ ఫిల్మ్స్ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథనాన్ని అందించారు.
 
డెబ్యుటెంట్ ఐశ్వరి థాకరే బబ్లూ – దబ్లూ అనే కవల సోదరుల ద్విపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
2000వ దశకపు చిన్న పట్టణ ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, హాస్యం, మా కా ప్యార్తో పాటు ఫుల్ మసాలా ఎంటర్టెయిన్‌మెంట్ ప్యాకేజీని అందించేలా ట్రైలర్ రూపొందింది.
 
 భారతీయ సినిమాకు తనదైన ముద్ర వేసిన అనురాగ్ కశ్యప్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐశ్వరి, వేదిక పింటో సహా మొత్తం తారాగణం అద్భుతమైన నటనను ప్రదర్శించారు. థియేటర్లలో ఈ మాయాజాలాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాం,” అని నిఖిల్ మధోక్, డైరెక్టర్ & హెడ్ ఆఫ్ ఇండియా ఒరిజినల్స్, అమెజాన్ MGM స్టూడియో ఇండియా & ప్రైమ్ వీడియో అన్నారు.
 
నిశాంచి – ప్రేమ, ఘర్షణ, సంగీతం, భావోద్వేగాల కలయికగా రాబోతున్న ఈ మసాలా ఎంటర్టెయినర్ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్