Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను భయపెట్టే పాత్రలే చేస్తాను... అదే నాకిష్టం అంటున్న సమంత

Advertiesment
నన్ను భయపెట్టే పాత్రలే చేస్తాను... అదే నాకిష్టం అంటున్న సమంత
, బుధవారం, 26 జూన్ 2019 (11:44 IST)
‘ఏ పాత్ర అయినా నన్ను భయపెట్టేలా ఉండాలి. ఆ పాత్రకు న్యాయం చేయగలనా? లేదా?.. అన్నంత ఛాలెంజింగ్‌గా ఉండాలి. అలాంటి పాత్రలనే చేస్తా. నన్ను భయపెట్టలేని పాత్రలను ఒప్పుకోను’ అంటున్నారు సమంత. ఏ సినిమా విజయానికైనా కంటెంట్ చాలా కీలకమని బీబీసీతెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
 
పెళ్లి తరువాత సినిమా ఆఫర్లు తగ్గాయా? అన్న ప్రశ్నకు... "పరిశ్రమలో ఎవరికి వారే ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వెంటనే... పెళ్లయ్యింది కదా, ఇంకా సినిమాలు చేస్తావా? అని అనేవారు సిద్ధంగా ఉంటారు. మనం ఇంట్లో కూర్చుని సినిమా ఆఫర్లు రావడంలేదు అంటే కుదరదు. మనకు మనమే దారులు ఏర్పాటు చేసుకోవాలి" అన్నారు సమంత.
webdunia
 
"నన్ను పెళ్లి.. పిల్లలు.. అని అడిగే వారికి నా పనే సమాధానం" అంటున్నారామె. "చాలా సినిమాల్లో హీరోయిన్‌ని ఎందుకు పెట్టారో కూడా అర్థంకాదు. సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత మరింత పెరగాల్సిన అవసరం ఉంది. మహిళల్లో నైపుణ్యం లేక కాదు, అవకాశాలొస్తే మహిళలు కూడా రాణిస్తారు, కానీ అవకాశాలు రావట్లేదు. పెద్ద హీరోల మాచోయిజాన్ని సపోర్ట్ చేసే పాత్రలు తప్పితే, మహిళలకు పెద్దగా అవకాశాలు లేవు. ఎంత కాలం ఇవే పాత్రలు చేస్తాం?" అని ప్రశ్నించారు సమంత.
 
సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోలింగ్స్ గురించి మాట్లాడుతూ, "ఇప్పుడు ట్రోలింగ్స్ అనేవి అలవాటైపోయాయి. కొత్తగా ట్రోలింగ్ ఎదుర్కొనే వారే ఇబ్బందిపడుతుంటారు. కొందరు ప్రశంసిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. సోషల్ మీడియాలో అందరూ మన అభిప్రాయాలతో ఏకీభవించాలని కోరుకోవడం తప్పు. అందరినీ మెప్పించడం సాధ్యం కాదు. కొంత కాలానికి ట్రోలింగ్స్ సాధారణమే అన్న విషయం ఎవరికైనా అర్థమైపోతుంది" అని అంటున్నారు సమంత.
 
#MeToo ఉద్యమం గురించి మాట్లాడుతూ, "ఈ వివాదంతో మహిళల్లో ఐక్యత వచ్చింది. అది చాలా కీలకం. ఒక మహిళే మహిళకు శత్రువులా ఉన్నప్పటి పరిస్థితుల్లో ఇలాంటి ఐక్యత ఏర్పడటం చాలా సంతోషకరం. దానిని ఆలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
webdunia
 
బాడీ షేమింగ్, మహిళను కించ పరిచేలా డైలాగులు ఉన్న చిత్రాలను తాను చేయనని సమంత తేల్చి చెప్పారు. 'మల్లేశం' సినిమా ఇంకా చూడలేదు, కానీ చూడాలని ఉంది అని చెప్పారు. "మల్లేశం లాంటి సినిమాలు చాలా అవసరం. కంటెంట్ మీద విశ్వాసం, ప్యాషన్‌తో సినిమా తీసేవారు అరుదుగా ఉంటారు" అని అన్నారు. రొటీన్ ఫార్ములా కాకుండా, వాస్తవ కథలను సినిమాలుగా మలిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చునని సమంత అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైట్ హౌస్‌కు మతి చలించింది: ట్రంప్ కొత్త ఆంక్షలపై ఇరాన్ విమర్శ