కే.ఏ పాల్... ఈ పేరు వినగానే ఠక్కున నవ్వు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే... ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటాయి కాబట్టి. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలపై కామెంట్ చేస్తూ.. తన పార్టీ గురించి చెబుతూ ఎంత కామెడీ చేసారో తెల్సిందే. అయితే... కే.ఏ పాల్‌ను చూసి బాగా ఇన్‌స్పైర్ అయినట్టున్నారు ఓ దర్శకుడు. ఏకంగా ఆయనపై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట. అవును.. ఇది నిజంగా నిజం. కే.ఏ పాల్ పాత్రను కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ చేయనున్నారని సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందట. సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేస్తారని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఇది ఏ తరహా చిత్రం అంటారా..? పొలిటికల్ డ్రామా అట. అయితే... ఇందులో కావాల్సినంత వినోదం ఉంటుందట. కే.ఏ పాల్‌ను తలుచుకుంటేనే నవ్వు వచ్చేస్తుంటుంది.
ఇలాంటి పాత్రను సునీల్ పోషిస్తే... ఇక వినోదం ఓ రేంజ్‌లో ఉంటుందో చెప్పనవసరంలేదు. ఆల్రెడీ నటీనటుల ఎంపిక జరుగుతోందట. మరి... తన గురించి సినిమా వస్తుంది అంటే కే.ఏ పాల్ పాజిటివ్‌గా తీసుకుంటారో..? లేక నెగిటివ్‌గా తీసుకుంటారో..? ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.