Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీరు తాగితే చల్లదనం వస్తుందా? ఎండలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బీరు తాగితే చల్లదనం వస్తుందా? ఎండలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:59 IST)
వేసవి ఠారెత్తిస్తోంది. ముదురుతున్న ఎండలు.. దాంతోపాటే ఉక్కబోతతో జనం అల్లాడుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కబోత.. బయటకొస్తే వడగాలులు.. ప్రజలు తప్పనిసరైతే తప్ప ఇల్లు దాటి కాలు బయటపెట్టడం లేదు. వడగాలుల నుంచి వడదెబ్బ నుంచి కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక మార్గాలు అనుసరిస్తుంటారు. ఇలాంటి మార్గాల్లో శాస్త్రీయత ఏమిటో.. ఏది సరైనదో.. పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
 
శీతల పానీయాలా? టీ కాఫీలా?
వడగాలుల ధాటికి దొరక్కుండా ఉండాలంటే, ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. శరీరంలోని నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. అయితే, ఈ ద్రవపదార్థాలు చల్లగానే ఉండాలా లేదంటే వేడిగా కూడా ఉండొచ్చా అనే చర్చ చాలాకాలంగా ఉంది. టీ, కాఫీ వంటి వేడిగా ఉండే పానీయాలు తీసుకుంటే అవి పొట్టలో చేరాక శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందని.. కాసేపటికే శరీరానికి చెమట పట్టి ఆ తరువాత చెమట ఆరినప్పుడు శరీరం చల్లబడుతుందని కొందరు చెబుతుంటారు.
 
అదే సమయంలో... వేడిగా ఉన్న పానీయాలు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత మరింత పెరిగి చెమట పడుతుందని.. ఆ చెమట ఆరి శరీరం చల్లబడడం వల్ల కలిగే మేలు కంటే శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోవడం వల్ల కలిగే నష్టం ఎక్కువగా ఉంటుందన్న మాటా వినిపిస్తుంది. వేసవిలో పరిస్థితులను బట్టి గరిష్ఠంగా రోజుకు 2 లీటర్ల నీరు కూడా శరీరం నుంచి బయటకు పోయే ప్రమాదం ఉంటుందట. కాబట్టి చెమట పట్టకుండా చూసుకోవాలని.. వేడిగా ఉండే పానీయాలకు వేసవిలో దూరంగాఉండాలని చెబుతారు. అందుకే శీతల పానీయాలు తీసుకోవాలంటారు.
 
ఇంతకీ ఏది నయం: నిజానికి వేడిగా ఉండే పానీయాలే శరీరాన్ని తొందరగా చల్లబరుస్తాయి. అయితే, ఆర్ధ్రత ఎక్కువగా ఉన్న వేళల్లో వేడి పానీయాలు తాగడం సరికాదు. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో వేడి పానీయాలు తాగి చెమటలు పట్టి శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నం చేయొచ్చు.
webdunia
 
ఫ్యాను వేసుకోవాలా వద్దా?
శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఫ్యాను కూడా ఉపయోగపడుతుంది. నిజానికి ఫ్యాను వల్ల గాలేమీ చల్లబడదు. కానీ, చట్టూ ఉన్న గాలిని అది తిప్పడం వల్ల గాలిసాగుతుంది.. అలా సాగిన గాలి శరీరానికి తాకి చల్లదనం కలిగిస్తుంది. అయితే, వేసవిలో ఫ్యాను వేసుకోవాలా వద్దా అన్న సంశయం కూడా చాలామందిలో ఉంటుంది. దీనికికారణం ఉంది. ఫ్యాన్లు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పెద్దగా ఉపయోగకరం కాదని పరిశోధనలు తేల్చాయి. అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయట.
 
ఒక్కోసారి బయట ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉండి గాలి కూడా వేడెక్కిపోతే అలాంటి సమయంలో ఫ్యాను వేయడం వల్ల మరింత నష్టం కలుగుతుందనీ చెప్తున్నారు. గాలి వేడెక్కినప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ వేడి గాలి శరీరానికి తాకి డీహైడ్రేషన్‌కు దారితీస్తుందంటారు.
 
ఇంతకీ ఏది నయం: 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రతలున్నప్పుడు ఫ్యాను వేసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
ఏసీ‌ ‘టెంపరేచర్’ 24°C చేయాలని కేంద్రం ఆలోచన - అలా చేస్తే ఏమవుతుందంటే..
 
కిటికీలు తెరవాలా వద్దా?
వేసవిలో గది కిటికీలు తీసి ఉంచాలా వద్దా అనే మీమాంస ఉంది. గది ఉష్ణోగ్రత కంటే బయట ఉష్ణోగ్రత, వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే కిటికీలు అస్సలు తెరవరాదని చెబుతారు. సాయంత్ర వేళల్లో గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి బయటవాతావరణం చల్లగా ఉంటే కిటికీలన్నీ తెరచి ఉంచుకోవాలని అంటారు. అందుకే పగటి వేళల్లో కిటికీలన్నీ మూసేయాలని.. సాయంత్రమయ్యాక తెరవాలని చెబుతారు.
 
ఇంతకీ ఏం చేయాలి: నిజమే.. వేసవిలో పగటి పూట వడగాలులు తీవ్రంగా ఉండి ఇంట్లో కంటే బయట నుంచి వీచే గాలులు వేడిగా ఉంటే తలుపులు, కిటికీలు మూసుకోవాలి. సాయంత్రం వాతావరణం చల్లబడ్డాక తలుపులు తెరవాలి.
 
వేసవిలో చల్లదనం కోసం బీరు తాగొచ్చా?
వేసవిలో వేడి నుంచి తప్పించుకోవడానికి వీలైనన్ని బీర్లు తాగాలని వాదించేవారుంటారు. అలాగే, బీరు తాగడం వల్ల ఏమీ శరీరానికి చల్లదనం కలగదని మరికొందరు వాదిస్తారు. వాస్తవానికి బాగా వ్యాయామం చేశాక బీరు తాగిన సందర్భాల్లో.. శరీరం ఎక్కువ నీటిని పొందటం కంటే.. మూత్రం ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతున్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇలా జరగడం శరీరానికి మంచిది కాదు. అయితే, ఆల్కహాల్ లేని బీరు తాగినప్పుడు మాత్రం ఫలితాలు కొంత మెరుగ్గా ఉన్నాయి.
webdunia
 
మరేం చేయాలి: ఈ విషయంలో గతంలో స్పెయిన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ట్రెడ్‌మిల్‌పై 40 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ చేసి బాగా చెమటలు పట్టిన తరువాత ఒక బీరు తాగడం వల్ల శరీరం మళ్లీ సరిపడా నీటిని సంతరించుకున్నట్లు గుర్తించారు.
 
శరీరానికి తగినంత నీటిని అందించడంలో బీరు కంటే కూడా సాధారణ నీళ్లు, స్పోర్ట్స్ డ్రింక్‌లు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. కాగా, బీరు తాగడం వల్లనే శరీరం చల్లబడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేయలేదు. కానీ, ఒకటి లేదా రెండు చిన్న బీర్లు తాగడం వల్ల శరీరానికి కావల్సిన నీరు అందుతుందని పరిశోధకులు తెలిపారు.
 
డిస్‌క్లెయిమర్: ఈ కథనం వివిధ పరిశోధనల ఫలితాలపై ఆధారపడి రాసింది మాత్రమే. వైద్యుల సలహాలు కాదని ఇలాగే పాటించాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహాలే పూర్తి ప్రామాణికం.
 
-క్లాడియా హేమండ్
బీబీసీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్కు అంటే వీడిదేరా బాబూ.. పర్సు పోగొట్టుకున్నాడు.. అయినా 36 కోట్లు వరించాయి..