Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

Advertiesment
Ginger with Buttermilk

సెల్వి

, బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (14:41 IST)
Ginger with Buttermilk
వేసవి రాకముందే చాలా చోట్ల ఎండల ప్రభావం మొదలైంది. అందువల్ల, వేసవి కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మనం సాధారణంగా కొన్ని సహజ పానీయాలు తాగుతుంటాం. వాటిలో ఒకటి మజ్జిగ. వేసవిలో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
 
కానీ దీనికి కొద్దిగా అల్లం కలిపి తాగడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అవును అదే నిజం. ఎందుకంటే మజ్జిగ, అల్లంలోని ప్రయోజనకరమైన లక్షణాలు బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజూ అల్లంను మజ్జిగలో కలిపి తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు నడుము చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది.  
 
వేసవిలో మజ్జిగ ఒక గొప్ప పానీయం. ఇది లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. పాలతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, ఇది ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా వుంటుంది. అంతే కాకుండా, మజ్జిగలో సోడియం, పొటాషియం, భాస్వరం, విటమిన్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. 
 
కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో మెరుగ్గా పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, దీనిలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే ఆమ్లం కడుపును శుభ్రపరుస్తుంది.
 
మిక్సర్ జార్‌లో కొద్దిగా పెరుగు వేసి, చిన్న అల్లం ముక్కను మెత్తగా కోసి, అవసరమైనంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుని తాగాలి. అవసరమైతే, జీలకర్ర పొడిని కలుపుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు