ఫాల్గుణ మాసం ఫిబ్రవరి 13న ప్రారంభమై మార్చి 14న ముగుస్తుంది. ఫాల్గుణ మాసం ఆనందం, ఉత్సవాల సమయంగా జరుపుకుంటారు. అయితే, తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ క్యాలెండర్ల ప్రకారం, ఫాల్గుణ మాసం ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 29, 2025న ముగుస్తుంది. వేసవి కాలం ప్రారంభమైనప్పుడు, శీతాకాలపు చలి క్రమంగా తగ్గిపోతుంది.
ఫాల్గుణ మాస సమయంలో చంద్రుడిని పూజించడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుందని విశ్వాసం. పురాణాల ప్రకారం, చంద్రుడు ఈ నెలలో జన్మించాడు. అందుకే చంద్రునికి ప్రార్థనలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఫాల్గుణ మాసమంతా ఉదయాన్నే నిద్రలేచి, సూర్యోదయానికి ముందు స్నానం చేయడం సూర్యుడిని ఉదయం పూట.. సాయంత్రం పూట చంద్రుడిని పూజించడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. మాఘ మాసంలో శుభ్రమైన, కొత్త తెల్లని బట్టలు ధరించి, దేవతలకు పూజలు చేయాలి.
అలాగే ఫాల్గుణ శుక్ల అష్టమి నాడు, లక్ష్మీదేవిని, సీతను పూజించే సంప్రదాయం ఉంది. ఫాల్గుణ చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు, శివుడిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఫాల్గుణ మాసంలో హోలీ, మహా శివరాత్రి, విజయ ఏకాదశి, యశోద జన్మోత్సవం, జానకి జన్మోత్సవం, అమలకి ఏకాదశి వంటి అనేక పండుగలు జరుగుతాయి.