భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, ధర్మనిష్ఠ, రాజభక్తి వంటివి అందరికీ గుర్తుకొస్తాయి. తన తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు.. తన సంసార సుఖాన్ని సైతం త్యాగం చేశాడు. ఈ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, ఆ చేసిన ప్రమాణాన్ని, తన తుది శ్వాస వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి భీష్ముడు.
ఇంకా సంధ్యా వందనం, సూర్యుడి అర్ఘ్యం సమర్పించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేవాడు కాదు. యుద్ధం చేసే సమయంలో సైతం సంధ్యా సమయంలో కాసేపు ఉండి, సూర్య ఉపాసన చేసి, తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధభూమిలోని ఇసుకతోనే అర్ఘ్య ప్రదానం చేసేవాడు.
అలాగే భీష్ముడు శ్రీకృష్ణుడికి భక్తుడిగా వుండేవాడు. అయితే కృష్ణుడిపై తనకున్న భక్తిని ఎక్కడా బయటకు చెప్పలేదు. కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు పది రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా వున్నాడు. కురుక్షేత్రం యుద్ధం అనంతరం భీష్ముడు అంపశయ్యపై దాదాపు 58 రోజుల పాటు జీవనం సాగించాడు.
సరిగ్గా మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి నాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమయ్యే తొలిరోజు తన తుది శ్వాస విడిచాడు. అలా మరణించిన తను మోక్షాన్ని పొందాడు. అలాంటి భీష్ముడికి భీష్మ నిర్యాణ్యమైన రోజున తర్పణం సమర్పించడం ద్వారా సర్వశుభాలు, వంశాభిృద్ధి చేకూరుతుంది