సాధారణంగా కొబ్బరి నూనెను తలకు వాడుతుంటాం. అయితే కొబ్బరినూనెను వంటల్లో ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంకా పరగడుపున కొబ్బరినూనె తాగడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ఆ ప్రయోజనాలేంటంటే?
* రోజు పరగడుపున కొబ్బరినూనెను తాగితే వారం లోపు బానపొట్ట తగ్గిపోతుంది.
* కొబ్బరి నూనెను పరగడుపున తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ వున్న కెలోరీలు కరిగిపోతాయి.
* రోజూ పరగడుపున కొబ్బరి నూనెను తీసుకుంటే.. అది కడుపు నిండిన భావనను ఇస్తుంది. తద్వారా ఆహారం తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. దీంతో బరువు తగ్గతారు.
* కొబ్బరి నూనెను పరగడుపున తీసుకుంటే అజీర్తి వుండదు.
* కొబ్బరి నూనెలోని పోషకాలు.. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఇంకా కిడ్నీలో రాళ్లను రానీయకుండా నియంత్రిస్తుంది.
* పరగడుపున కొబ్బరినూనెను తాగితే శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది.