Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో వుంటే ఏమవుతుంది?

Advertiesment
empty stomach
, శుక్రవారం, 31 జనవరి 2020 (22:22 IST)
ఎక్కువసేపు ఖాళీ కడుపుతో వున్నవారిలో కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది. ఈ ఎసిడిటీ తలెత్తడానికి కారణాలు ఇదే కాకుండా చాలానే వున్నాయి. ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసు, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి ఆ తర్వాత భోజనం తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
  
1. తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాకొలేట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
 
2. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు... ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి.
 
3. తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. 
 
4. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. 
 
5. అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను నిత్యం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
6. నిత్యం బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదుసార్లు తీసుకుంటుండాలి. 
 
7. ఎసిడిటీతో బాధపడుతుంటే బాదం పప్పులను సేవించండి.
 
8. కొబ్బరి నీళ్ళను రోజుకు మూడు-నాలుగు సార్లు సేవించాలి.
 
9. భోజనానంతరం పుదీనా రసం సేవిస్తే అసిడిటీ నుంచి ఉపశమనం కలిగి మంచి ఫలితాన్నిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాలుకల పవర్ తెలిస్తే తినేస్తారంతే