ఆ చెంబుతో నీళ్లు తాగితే చాలు...
పురాతన కాలంలో రాగి పాత్రలో ఉన్న నీళ్ళను ఎక్కువగా తీసుకునేవారు. అప్పుడు రాగి బిందెలు, రాగి పాత్రలు ఎక్కువగా ప్రసిద్థి చెందాయి. రాగి పాత్రల్లో నీళ్ళు తాగినా, రాగి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా మంది నమ్మకం. నమ్మకం
పురాతన కాలంలో రాగి పాత్రలో ఉన్న నీళ్ళను ఎక్కువగా తీసుకునేవారు. అప్పుడు రాగి బిందెలు, రాగి పాత్రలు ఎక్కువగా ప్రసిద్థి చెందాయి. రాగి పాత్రల్లో నీళ్ళు తాగినా, రాగి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా మంది నమ్మకం. నమ్మకం మాత్రేమ కాదు. ఇది వాస్తవం కూడా. అందుకోసం రాగిపాత్రలో నీళ్లు నింపి పెడితే ఎన్ని రోజులైని పాడవకుండా ఉంటుంది.
రాగిపాత్రలోని నీటిని తాగితే శరీరానికి థెరపెటిక్ వలే పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగిపాత్రలో నిల్వ చేయడం ద్వారా వాత, కఫ, పిత్త వంటి సమస్యలను హరిస్తుంది. అంతేకాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను కలిగిస్తుంది. రాగిపాత్రలో నీటిని 8గంటల సమయం నిల్వ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని ఇప్పటికీ చాలా మంది అనుసరిస్తున్నారు.
రాగి పాత్రలోని నీటిని తాగితే జీర్ణశక్తి పెరిగి, ఫ్యాట్ కరుగుతుంది. తిన్న ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది. గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వయస్సు పైబడినట్లు కనబడకుండా ఉండాలంటే రాగి చెంబులోని నీటిని తాగాల్సిందే. యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ క్రియలు సక్రమంగా జరగాలంటే రాగి చాలా అవసరం అవుతుంది. బ్రెయిన్ సిగ్నల్స్ చురుగ్గా ఉండే విధంగా చేస్తుంది.