Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-05-2021 నుంచి 05-06-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

Advertiesment
30-05-2021 నుంచి 05-06-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు
, ఆదివారం, 30 మే 2021 (18:05 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సానుకూలమవుతుంది. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. దంపతుల మధ్య దాపరికం తగదు. గృహమార్పు అనివార్యం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగులకు ఇంటర్య్వూలు అనుకూలించవు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ప్రతికూలతలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. కుటుంబ విషయాలపై శ్రద్ద వహించండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. కలసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గురు, శుక్ర వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. స్థిమితంగా వుండటానికి యత్నించండి. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. రాబడిపై దృష్టి పెడతారు. శనివారంనాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వృత్తివ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. కార్మికులు, వృత్తుల వారికి కష్టకాలం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమిస్తే విజయ తథ్యం. మాటతీరు అదుపులో వుంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనావేయొద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రముఖుల సందర్శన కోసం నిరీక్షిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదరువతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు స్థానచలనం. విదేశీయాన యత్నాలు ముందుకు సాగవు. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా వుండాలి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మీ జోక్యం అనివార్యం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆది, గురు వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన తప్పనిసరి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతగా వుండవు. ఏ పని మొదలెట్టినా మొదటికే వస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. స్థిమితంగా వుండేందుకు యత్నించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిస్తాయి. శుక్ర, శని వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. ఖర్చులు అదుపులో వుండవు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. సోమ, మంగళ వారాల్లో అసహనం, చికాకులు అధికం. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అరమరికలు తగవు. ప్రతి విషయాన్నీ మీ శ్రీమతి తెలియజేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు శ్రమ, నిరుత్సాహం అధికం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించవు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యత, అకాలభోజనం. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. న్యాయ, సేవా, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో వుండవు. ధన సమస్యలెదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఓ సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన శ్రేయస్కరం. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబీకుల ప్రోత్సాహం వుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అపరిచితులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. పెట్టుబడులకు అనుకూలం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి చికాకులు అధికం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు ప్రయోజనకరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. గురు, శుక్ర వారాలలో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. గృహమార్పు అనివార్యం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. సంతానంపై చదువులపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నుంచి విముక్తి కలగాలని తిరుమలలో సుందరకాండ పారాయణం