Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1-8-2021 నుంచి 31-8-2021 వరకూ మీ మాస ఫలితాలు

Advertiesment
1-8-2021 నుంచి 31-8-2021 వరకూ మీ మాస ఫలితాలు
, శనివారం, 31 జులై 2021 (18:49 IST)
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదా మార్పు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తుతాయి. గుట్టుగా వ్యవహరించండి. గృహం ప్రశాంతంగా వుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కీలక పత్రాలు అందుకుంటారు. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకునిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారును ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి.
 
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు తొలగుతాయి. సమర్థతను చాటుకుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం ఉత్సాహాన్ని అదుపుచేయండి. విద్యా సంస్థలకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్యాలు, విందుల్లో పాల్గొంటారు.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికీ శుభదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం పైచదువులను వారి ఇష్టానికే విదిలేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయంలో మెలకువ వహించండి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆప్తుల సలహా పాటించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. ధనలాభం ఉన్నా ఆకస్మిక ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. సంతానం దూకుడు అదుపుచేయండి. సంస్థల స్థాపనకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అర్థాంతరంగా నిలిపివేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య సమన్వయలోపం. ఆత్మీయుల హితవు సత్ప్రభావం చూపుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విమర్శలకు దీటుగా స్పందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు విపరీతం. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. కార్మికులు, వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం అనుకూలదాయకమే. రుణ ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. వివాహ యత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం దూకుడు అదుపుచేయండి. పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనకు అనుకూలం. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ చిత్తశుద్ధికి ప్రశంసలు అందుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. గృహం సందడిగా వుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం అనుకూలిస్తుంది.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలతో తీరిక వుండదు. సొంత నిర్ణయాలు తగవు. పరిచయం లేని వారితో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఖర్చులు విపరీతం. ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు వెనుకాడుతారు. అవసరాలు వాయిదా పడతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి లేక శ్రీవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు కష్టకాలం. అధికారులకు పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యంలో పాల్గొంటారు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఏ పని చేసినా మొదటికే వస్తుంది. వ్యయాలకు పొంతన వుండదు. స్థిమితంగా వుండటానికి ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఈ చికాకులు తాత్కాలికమే. ఆత్మస్థైర్యంతో మెలగండి. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. విద్యాసంస్థలకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు స్థానంచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. కార్మికులకు కష్టకాలం. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. మీ శ్రమ వృధా కాదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. వెండి, బంగారు వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. పత్రాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. గృహమార్పు అనివార్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగష్టు నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు, ఏమిటో తెలుసా?