Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు నెరవేరుతాయి.

Advertiesment
Today Daily Astrology dated on 18th October'2021Daily Horoscope
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (05:00 IST)
మేషం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ఆదరణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. క్లిష్ట సమయంలో మీ శ్రీమతి సహాయం లభిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు.
 
వృషభం :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదలతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలోను, సంఘంలోను మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారంలో పునరాలోచన అవసరం.
 
మిధునం :- బంధువుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
కర్కాటకం :- మీ కళత్ర వైఖరి అసహనానికి గురిచేస్తుంది. తల పెట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. అధికారులకు మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
సింహం :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉదర సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్ధులు ఒత్తిడి, భయాందోళనలకు గురవుతారు. 
 
కన్య :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సన్నిహితులతో కలిసి దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి.
 
తుల :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మీ రాక బంధువులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా ఎదుర్కుంటారు. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. ప్రేమికుల తొందరపాటు చర్యల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం :- విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో రణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. దైవ దర్శనాలకు అనుకూలం. స్త్రీల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పెద్దలు, ప్రముఖులతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ఏకాగ్రత వహించండి. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఎంతో శ్రమించిన మీదట గాని అనుకున్న పనులుపూర్తి కావు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మకరం :- కలప, సిమెంటు, ఐరన్ వ్యాపారులకు పురోభివృద్ధి. కోర్టు వ్యవహరాల్లో అనుకూల ఫలితాలుంటాయి. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు ధన వ్యయం, బ్యాంకు వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు.
 
కుంభం :- దంపతుల మధ్య ప్రేమాను బంధాలు నెలకొంటుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటారు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
మీనం :- ఆర్థికస్థితి నిరుత్సాహపరుస్తుంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఒకానొక సందర్భంలో మీ కుటుంబీకుల ధోరణి అసహనం కలిగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18-10-2021 సోమవారం దినఫలాలు .. శంఖరుడిని పూజించినా..