Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-06-2023 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...

Advertiesment
Gemini
, గురువారం, 29 జూన్ 2023 (04:00 IST)
మేషం :- మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించటం క్షేమదాయకం. చిట్స్, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మ్మీద పూర్తిచేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహాం, సందడి చోటు చేసుకుంటాయి.
 
వృషభం :- తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. ధనం ఎంత వస్తున్నా నిల్వ చేయలేకపోతారు. కోర్టు వాజ్యాలను ఉపసంహరించుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్ధిక సంతృప్తి అంతగా ఉండదు. సోదరి, సోదరుల మధ్య పోరు అధికంగా ఉంటుంది.
 
మిథునం :- వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరై జయం పొందుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకంమాని ఓర్పు, విజ్ఞతా యుతంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
కర్కాటకం :- గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. సినిమా, కళారంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
సింహం :- దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఒక విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీలోని బలహీనతలను తొలగించుకోవటంపై దృష్టి పెడతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
కన్య :- స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ప్రైవేటు సంస్థలలో వారు వారి అశ్రద్ధ, ఆలస్యాలవలన ప్రభుత్వ అధికారుల నుంచి చికాకులు ఎదుర్కుంటారు. రాజకీయనాయకులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల :- కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఏదైనా అమ్మకానికై చేయుయత్నం వాయిదా పడటం మంచిది. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.
 
వృశ్చికం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
 
ధనస్సు :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
మకరం :- బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పుఎంతో అవసరం. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
కుంభం :- ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మిమ్ములను నిందించిన వారేమీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగాఉంటుంది.
 
మీనం :- ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకువ అవసరం. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో వున్నాయా? డబ్బు కావాలంటే..?