Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Advertiesment
daily astrology

రామన్

, గురువారం, 26 జూన్ 2025 (00:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం సాధిస్తారు. మాససికంగా కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు అధికం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనుల సానుకూలమవుతాయి. కానుకలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ప్రయాణం చేయాల్సివస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పనులు ముందుకు సాగవు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ఆప్తులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితులు హితవు మీలో మార్పు తెస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ పట్టుదల స్పూర్తిదాయమకవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలకు ధనం అందుతుంది. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువుల రాక చికాకుపరుస్తుంది. ఖర్చులు విపరీతం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అవసరానికి సన్నిహితులు సాయం అందిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు, పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కష్టం ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వేడుకకు హాజరవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?