Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Advertiesment
astro8

రామన్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సర్వత్రా అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సమర్ధతపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పిల్లలకు శుభం కలుగుతుంది, శుభకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. నోటీసులు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. కార్యసాధనకు మరింత శ్రమించాలి. మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా యత్నాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది. మీ సాయంతో ఒకరికి లబ్ధి కలుగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోభీష్టం సిద్ధిస్తుంది. వాక్చాతుర్యంతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మనోధైర్యంతో శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గుట్టుగా మెలగండి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను దక్కించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితులు వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...