Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-03-2024 గురువారం దినఫలాలు - ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి...

Advertiesment
horoscope

రామన్

, గురువారం, 21 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ ద్వాదశి తె.5.36 ఆశ్రేష రా.2.30 ప.వ.2.22 ల4.02. ఉ.దు. 10. 13 ల 11.00 ప.దు. 2.55 ల3.42.
 
మేషం :- ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. కోర్టు వ్యవహరాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటాయి. 
 
వృషభం :- ఖాదీ, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. మిత్రుల కలయికతో గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఉన్నతస్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. విద్యార్థులు భయాందోళనలు వీడి మరింత కష్టపడాల్సిఉంటుంది. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
మిథునం :- శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ముఖ్యంగా ప్రింట్, మిడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు శ్రేయోదాయకం. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. బ్యాంక్ పనులు మందకొడిగా సాగుతాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అసవరం.
 
సింహం :- భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉపాధ్యాయులకు గుర్తింపు, మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
కన్య :- పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఇబ్బందులు తప్పవు. రేషన్ డీలర్లకుకొత్త సమస్యలు తలెత్తుతాయి. కొద్దిపాటి ధనసహాయం చేసి మీ సంబంధాలు చెడకుండా చూసుకోండి. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడుట వల్ల ఆందోళన చెందుతారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను సమర్ధంగా ఎదుర్కుంటారు.
 
తుల :- హోటల్, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు అనుకూలం. ధనం ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగ యత్నంలో స్త్రీలకు ఓర్పు, పట్టుదల ప్రధానం. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు :- దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు తప్పవు. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతారు. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకువస్తాయి. కొత్తపనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటి పైనే శ్రద్ధ వహించండి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం.
 
మకరం :- ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. విశ్రాంతి లోపం, ఆకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులతోమెళుకువ అవసరం.
 
కుంభం :- వ్యాపారాల అభివృద్ధికి స్కీములు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరక పోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. క్రయ విక్రయాల విషయంలో శ్రేయోభిలాషుల సలహా పాటించటం మంచిది. స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి. మీ అతిథి మర్యాదలు బంధువులను సంతృప్తిపరుస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవింద ద్వాదశి 2024: శ్రీ నరసింహ స్వామిని పూజించాలి.. ఎందుకు?