Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-01-2025 శనివారం దినఫలితాలు : సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది..

Advertiesment
horoscope

రామన్

, శనివారం, 18 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రశంపలు, పురస్కారాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలమవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాలి. భేషజాలకు పోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. గుట్టుగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార జయం, ప్రశాంతత పొందుతారు. రావలసిన ధనం అందుతుంది. పనుల్లో ఒత్తిడి అధికం. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. పట్టుదలతో యత్నాలు కొనసాగిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. లక్ష్యానికి చేరుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఖర్చులు సామాన్యం. పనులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
కొంతమొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహమరమ్మతులు చేపడతారు. బంధువులతో సంభాషిస్తారు. పనులు పురమాయించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రదేశం సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు కొంత మొత్తం పొదుపు చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. వాహనదారులకు దూకుడు తగదు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార పరిజ్ఞాంతో నెట్టుకొస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తిచేస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలను తెలియజేయండి. ఆప్తులు సాయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. సామాజక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ధనం మితంగా వ్యయం చేయండి. భేషజాలకు పోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. మీ జోక్యం అనివార్యం. ఆలయాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-01-2025 శుక్రవారం దినఫలితాలు : రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు...