Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

Advertiesment
horoscope

రామన్

, మంగళవారం, 17 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ధైర్యంగా యత్నాలు సాగించండి. దీక్షతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అపజయం మీలో పట్టుదలను రేకెత్తిస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సానుకూలమవుతుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒత్తిళ్లకు గురికావద్దు. కీలక వ్యవహారంలో పెద్దల సలహా తీసుకోండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అభీష్టం నెరవేరుతుంది. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రతను కోల్పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. లక్ష్యసాధనకు చేరువవుతారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవకాశాలను చేజిక్కించుకుంటారు. ధనవ్యయంలో మితం పాటించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త బంధుత్వాలు బలపడతాయి. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు అధికం. పనులు మధ్యలో నిలిపివేయొద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దూరప్రయాణం తలపెడతారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభవార్త వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు, ఖర్చులు విపరీతం. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనులు పురమాయించవద్దు. అందరితోను మితంగా మాట్లాడండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధైర్యంగా అడుగు ముందుకేయండి. లావీదేవీలు కొలిక్కివస్తాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కార్యదీక్షతో లక్ష్మాన్ని సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మధ్యలో నిలిపివేయొద్దు. నోటీసులు అందుకుంటారు. అనవసర జోక్యం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యానుకూలత ఉంది. దీక్షతో శ్రమించి మంచి ఫలితం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి సేవాకార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...