Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-01-2024 సోమవారం దినఫలాలు - అమ్మవారిని పూజించడంవల్ల సర్వదా శుభం...

Advertiesment
astro1

రామన్

, సోమవారం, 15 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ చవితి ఉ.9.58 శతభిషం ప.1.12 రా.వ.7.08 ల 8.37. ప.దు. 12.24 ల 1.08 పు. దు. 2.36 ల 3.20.
అమ్మవారిని పూజించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి లోనవుతారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. తలపెట్టిన పనులు అర్థాంతంగాముగిస్తారు. 
 
వృషభం :- ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్లలో శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటం మంచిది. భాగస్వామిక చర్చలు సంప్రదింపులు ప్రశాంతంగా ముగుస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయటం మంచిదికాదు.
 
మిథునం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం కోసంధనం బాగా వెచ్చిస్తారు. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది.
 
కర్కాటకం :- నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఎదుటివారితో వాగ్వివాదాలు, పంతాలకు పోవటం మంచిది కాదు. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమ వుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, శ్రమాధిక్యతమినహా ఆదాయం అంతంతమాత్రంగా ఉంటుంది.
 
సింహం :- బంధువులరాకతో ఆకస్మింగా ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరతాయి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి శారీరిక బాధలు, చికాకులు వంటివి సంభవిస్తాయి.
 
కన్య :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. చిన్నారులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. ప్రియతములు ఇచ్చే సలహ మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. గృహంలో ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తుల మీద మక్కువ పెరుగుతుంది.
 
తుల :- ఎంత ధనం వచ్చినా ఖర్చుకు సిద్ధంగా ఉంటాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి,
 
వృశ్చికం :- మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికిమిశ్రమ ఫలితం. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు :- బంధువులతో కలసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. విందుల్లో పరిమితి అవసరం. మీ శ్రీమతి, సంతానం కోరికలు తీర్చగల్గుతారు. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. టాక్స్ వంటి సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి.
 
మకరం :- పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉమ్మడి వెంచర్లు, నూతన పెట్టుబడుల నిర్ణయం ప్రస్తుతం తగదు. టీ.వీ కార్యక్రమాలు, పోటీల్లో స్త్రీలు రాణిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు.
 
కుంభం :- దంపతుల మధ్య పొత్తు పొసగదు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో గౌరవమర్యాదలు, ఆదరణ లభిస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలించవు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమం కాదు. బంధువులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మీనం :- సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు లభస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. కొనుగోలుదార్లను, పనివారలను గమనిస్తూండాలి. ఇతరుల తప్పిదాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త. అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-01-2024 ఆదివారం దినఫలాలు - విష్ణుమూర్తిని పూజించి ఆరాధించిన మీ సంకల్పం...