శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు|| విదియ ప.2.29 శ్రవణం సా. 4.23 రా.వ.8.07ల 9.37
ఉ.దు. 6.35 ల 8.03.
ఆంజనేయస్వామి దండకం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది.
మేషం :- భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం లభిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉద్యోగస్తుల పదోన్నతికి మరికొంత సమయం పడుతుంది. భేషజాలకు పోయి విపరీతంగా వ్యయం చేస్తారు.
వృషభం :- వివాదాస్పద విషయాల్లో సర్దుకుపోవటానికి యత్నించండి. బంధువులతో సంప్రదింపులు ఫలిస్తాయి. పత్రికా సిబ్బందికి తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. ప్రతిభకు తగిన గుర్తింపు, పురస్కారాలు అందుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతతాయి.
మిథునం :- మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. విద్యార్థులకు సహచరులతో సాన్నిహిత్యం నెలకొంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి అధికం. పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
కర్కాటకం :- బ్యాంకు పనులు చికాకు కలిగిస్తాయి. మనస్సుకు కష్టం, ధననష్టం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలే జరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
సింహం :- పాత రుణాలు తీరుస్తారు. దంపతులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులు అతిగా వ్యవహరించట వల్ల చిక్కుల్లో పడే ఆస్కార ఉంది.
కన్య :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయాలలోనివారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం ముడుతుంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండగలవు.
తుల :- అధికారులకు తనిఖీలు, పర్యటనలు అధికమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలిచి సహాయం అందిస్తారు. మీ కళత్ర వైఖరి చికాకు కలిగిస్తుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
వృశ్చికం :- రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. వృత్తి వ్యాపారులకు లాభదాయకం. సిమెంటు, ఇటుక, కలప, ఐరన్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రవాణా, ప్రకటనలు, విద్యా రంగంలోని వారికి శుభప్రదంగా ఉంటుంది.
ధనస్సు :- ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మకరం :- స్త్రీలకు ఇరుగు, పొరుగువారితో పట్టింపులు అధికం అవుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
కుంభం :- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు తప్పవు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. కానివేళలో బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబసభ్యులు మసలుకుంటారు.
మీనం :- రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. తొందరపడి వాగ్దానాలుచేసి సమస్యలు తెచ్చుకోకండి. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం.