Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-01-2025 ఆదివారం దినఫలితాలు - తలపెట్టిన కార్యం నెరవేరుతుంది.

Advertiesment
Astrology

రామన్

, శుక్రవారం, 14 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగండి. అతిగా ఆలోచించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి లాభిస్తుంది. చీటికిమాటికి చికాకుపడతారు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, ఆకాలభోజనం. బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. మీ సలహా కొందరికి ఉపకరిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అవసరాలు నెరవేరవు. అయిన వారితో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్దిచేకూరుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఒంటెద్దుపోకడ తగదు. ప్రముఖుల జోక్యం అనివార్యం. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఆప్తులను కలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. చీటికిమాటికి చికాకుపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chanakya Niti: ఈ నాలుగు లేని చోట నివసించే వారు పేదవారే.. చాణక్య నీతి