Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-04-202 శనివారం దినఫలాలు - పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు...

Advertiesment
Astrology

రామన్

, శనివారం, 13 ఏప్రియల్ 2024 (05:30 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ పంచమి సా.4.15 మృగశిర తె.4.50 ఉ.వ.10.25 ల 12.01. ఉ.దు. 5.55 ల 7.33.
 
మేషం :- పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
వృషభం :- రాజకీయాలకు సంభంధించిన ఆలోచనలు చుట్టు ముడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ఉద్యోగస్తుల కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం :- మార్కెట్ రంగాలవారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఒకే కాలంలో అనేకపనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. వ్యాపారాభివృద్ధికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీమాట పై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. 
 
కన్య :- స్త్రీలు ఎటువంటి ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా చిత్తశుద్ధితో వ్యవహరించటం అన్ని విధాలా శ్రేయస్కరం. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఉద్యోగస్తులు అధికారులకు విలువైన కానుకలు అందించి పరిచయాలు పెంచుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
తుల :- కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును.
 
వృశ్చికం :- పండ్లు, కొబ్బరి, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సోదరి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలువేస్తారు. 
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు సంభవిస్తుంది. మీ అభిరుచి తగిన వ్యక్తితో పరియం ఏర్పడుతుంది.
 
మకరం :- తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. ఎల్.ఐ.సి., పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. మీరు దేనిని నమ్ముతారో ఆవిషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- స్త్రీలకు ఆర్జన పట్ట ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మీనం :- ఇతరులు చెప్పిన మాటపై దృష్టిపెట్టకండి. కానీ వెళ్ళల్లో ఇతరుల రాక ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి. ప్రయాణాలల్లో స్వల్ప చికాకులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-04-2024 శుక్రవారం దినఫలాలు - దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి...