Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-12-2022 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన..

Advertiesment
Astrology
, బుధవారం, 7 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. రవాణా, ఎగుమతి రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. 
 
వృషభం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
మిథునం :- బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. కలప, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థుల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్త్రీలకు ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
సింహం :- నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి కలిసివచ్చేకాలం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళుకువ వహించండి. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఏకాగ్రత అవసరం. బంధు మిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
కన్య :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ముఖ్యుల కోసం, మీ ప్రియ తముల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికం. మీ విలువైన వస్తువులు ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
తుల :- వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉపవాసాలు, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
వృశ్చికం :- రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. భాగస్వామిక సమావేశంలో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. విద్యార్థులు మొండివైఖరి అవలంభించుట వల్ల మాటపడక తప్పదు. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
ధనస్సు :- వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యుల సమాచారం అందుతుంది. దూరప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు పురోభివృద్ధి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
మకరం :- వస్త్ర, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ఒప్పందాలు, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీల తెలివి తేటలకు, వాక్చాతుర్యానికి గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం :- అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు. రాని మొండి బకాయిలు సైతం వసూలు చేస్తారు. కుటుకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
మీనం :- ఇంటా, బయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించకోవటం ఉత్తమం. తొందరపాటు మాటలు, నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పులను తీర్చే లాఫింగ్ బుద్ధా.. కలబంద...?