Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-12-2022 మంగళవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం..

Advertiesment
Astrology
, మంగళవారం, 6 డిశెంబరు 2022 (04:01 IST)
మేషం :- స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి, గౌరవం పొందుతారు. ఇతర దేశాలలో ఉన్న బంధు, మిత్రులను కలుసుకోగలుగుతారు. విద్యార్ధినిలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. పారిశ్రామిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు శుభదాయకం. 
 
వృషభం :- మీ సంతానం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి వంటి శుభ పరిణామాలు ఉంటాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోవటానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి.
 
మిథునం :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి శుభదాయకం. స్తిరాస్థి క్రయ, విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. తలపెట్టిన పనులు త్వరితగతిని పూర్తి చేస్తారు. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు అధిక ఒత్తిడి, శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారంకాగలవు.
 
కర్కాటకం :- మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. కళ, క్రీడల రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉటుంది. భూవివాదాలు, పాత సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. 
 
సింహం :- కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. తరచు దైవకార్యాలలో పాల్గొంటారు. జాయింటు వెంచర్లకు సంబంధించి బాగుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. తొందరపడి మీ అభిప్రాయాలు బయటకు చెప్పటం వలన సమస్యలు ఎదుర్కొంటారు. భార్యా, భర్తల మధ్య సయోధ్య కుదరదు.
 
కన్య :- చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారులకు అధిక శ్రమ ఉండును. ఉన్నతాధికారులపై దాడులు జరుగుతాయి. విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలలో మంచి ప్రతిభను కనపరుస్తారు. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. అవసరానికి ఋణం దొరుకుతుంది.
 
తుల :- టెక్నికల్, కంప్యూటర్ రంగాలలో వారికి లాభదాయకం. పండితులకు మంచి ప్రోత్సాహాకరంగా ఉంటుంది. వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ నూతన పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. విద్యార్థులకు అధికమైన, చికాకులు ఇబ్బందులు కలుగును.
 
వృశ్చికం :- విదేశాలకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకం. పాల్గొంటారు. ఊహించని వారి నుండి మీకు ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల రాకపోకలు ఊహించని గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- బంధువుల రాకతో కుటుంబంలోని వారు ఉల్లాసంగా ఉంటారు. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రముఖులతో, పెద్దలతో అభిప్రాయాలు కలిసివస్తాయి. సభా, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్ధులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బంగారు, వెండి, వస్త్ర వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మకరం :- వారసత్వం వలన కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. ఉపాధ్యాయులు మార్పులకైచేయు ప్రయత్నాలు ఫలించగలవు. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్థులు ఒత్తిడిని, శ్రమను అధికంగా ఎదుర్కొంటారు. 
 
కుంభం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. బాకీలు, ఇంటి అద్దె వసూలులో సంయమనం పాటించండి. లాయర్ నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. ఎదుటి వారికి సలహాలు ఇచ్చి మీరు సమస్యలు తెచ్చుకుంటారు. సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి.
 
మీనం :- పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చు కుంటారు. మీ ఆంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. స్త్రీలకు పనివారితో ఓర్పు, నేర్పు అవసరం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-12-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ...