Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-10-2022 బుధవారం దినఫలాలు - అమ్మవారిని చామంతి పూలతో ఆరాధించిన..

Advertiesment
Mithunam
, బుధవారం, 5 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- విందులలో పరిమితి పాటించండి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. వృత్తులు, కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. నేటి కంటె రేపు అనుకూలం.
 
వృషభం :- ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. వైద్యులకు విశ్రాంతి లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
మిథునం :- దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
కర్కాటకం :- స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. 
 
సింహం :- కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానవస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.
 
కన్య :- వ్యాపార వర్గాల వారిమాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెవవేరుతాయి. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. 
 
తుల :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు.
 
వృశ్చికం :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. మిత్రులతో కలసి విందుల్లో పాల్గొంటారు. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలు ద్విచక్ర వాహనం పై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు.
 
ధనస్సు :- కానివేళలో బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు.
 
మకరం :- దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి.
 
కుంభం :- అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలు ఆత్మీయులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది.
 
మీనం :- కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొట్టెల రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఆత్మీయుల రాక సంతోషపరుస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుర్గాష్టమి అంటే ఏమిటి.. దుర్గామాతను ఎందుకు పూజిస్తారు?