Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-07-2021 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో....

Advertiesment
03-07-2021 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో....
, శనివారం, 3 జులై 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక  సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఓ మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య రంగాలలో వారికి నెమ్మదిగా సంతృప్తి కానవస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. సొంతంగా వ్యాపారం పెట్టాలనే ఆసక్తి మీలో అధికంగా పెరుగును. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఓ మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిథునం : స్త్రీలు గృహమునకు కావలసిన వస్తువుల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిదిగా భావించకండి. 
 
కర్కాటకం : పరస్త్రీతో జాగ్రత్తగా వ్యవహరించండి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి, ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. మీ అభిలాషకు నెరవేరే సమయం ఆసన్నమవుతోందని గమనించండి. మీ పరోపకారబుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. 
 
సింహం : వ్యాపార భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సహోద్యోగులతో కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి విద్యా కోర్సులలో రాణిస్తారు. ఇతరులు మిమ్మల్ని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కన్య : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. సొంతంగాగానీ, భాగస్వామ్యంగాగానీ మీరు ఆశించిన విధంగా రాణించలేరు. 
 
తుల : స్థిరాస్తి క్రయ, విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలలో మెళకువ అవసరం. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘకాలికంగా వాయిదాపడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. పెన్షన్, బీమా సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బంది కలిగిస్తాయి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చును. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. చేతి వృత్తుల వారికి ఇబ్బందులు తప్పవు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. 
 
ధనస్సు : రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. ప్రత్తి పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. 
 
మకరం : ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. డిపాజిట్లు చేతికందుతాయి. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాశాలల్లో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులకు చేపట్టేందుకు అనుకూల సమయం. 
 
కుంభం : కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మీ పై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. రుణ విముక్తులు కావడంతో పాత రుణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం : చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలను మించుతాయి. చాకచక్యంతో లక్ష్యాలు సాధిస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆలయం సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకర సమయం. నిరుద్యోగులకు ఆశాజనకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-07-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించినా...