Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21-12-2020 సోమవారం దినఫలాలు - ఈశ్వరాధాన చేయడం వల్ల...

21-12-2020 సోమవారం దినఫలాలు - ఈశ్వరాధాన చేయడం వల్ల...
, సోమవారం, 21 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. పత్రిక, ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు ఎదుటివారితో మితంగా సంభాషించడం ఉత్తమం. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
వృషభం : వ్యాపారస్తులు అధిక శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. రావలసిన ధనం చేతికి అందకపోవడం వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక, దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యంలో జాగ్రత్తలు పాటించండి. 
 
మిథునం : ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులు ఒత్తిడిని, శ్రమను అధికంగా ఎదుర్కొంటారు. స్త్రీల ధ్యేయం నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం సంఘంలో మీ మాటపై నమ్మకం గౌరవం పెరుగుతాయి. విదేశీ చదువులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం : కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థుల స్వయం కృషితో రాణిస్తారు. సమయానికి మిత్రులు సహకరించడం వల్ల అనుకున్నది సాధిస్తారు. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. 
 
సింహం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులు తోటివారి సహకారం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫైనాన్స్, వ్యాపారస్తులు మెళుకవ వహించండి. రావలసిన ఆదాయంపై దృష్టిసారిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలం. రవాణా, మెకానికల్ ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. రాజకీయ నాయకులు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొంతమంది సూటిపోటి మాటల వల్ల మీరు మానసికంగా ఆందోళన చెందుతారు. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి. 
 
తుల : స్త్రీలకు టీవీ చానెళ్లు, పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుకుంది. సోదరికి మీ వంతు సహకారాలు అందిస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ధనం ఏ మాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచాయలేర్పడతాయి. 
 
వృశ్చికం : మీ కుటుంబీకుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. సంతానంపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. ప్రయాణాలలో మెళకువ అవసరం. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
ధనస్సు : పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు చూసి మోసపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు అలసట అధిక శ్రమ తప్పదు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
మకరం : ఆర్థిక విషయాలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. 
 
కుంభం : బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గృహోపకరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలు షాపింగ్‍ల కోసం ధనం ఖర్చు చేస్తారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. 
 
మీనం : ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండగు, సన్నిహితులు నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే..?