Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-12-2020 శనివారం దినఫలాలు - వేంకటేశ్వర స్వామికి ఆరాధన చేస్తే...

Advertiesment
19-12-2020 శనివారం దినఫలాలు - వేంకటేశ్వర స్వామికి ఆరాధన చేస్తే...
, శనివారం, 19 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. రాజకీయ నాయకులకు విదేశీయాన ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. 
 
వృషభం : నిరుద్యోగులకు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలువంటివి జరుగుతాయి. చిన్ననాట వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. 
 
మిథునం : వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకుసాగండి. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం ఉత్తమం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. విదేశీయాయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం : దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వడం మంచిదికాదని గమనించండి. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. 
 
సింహం : దంపతులకు సంతానం ప్రాప్తి కలుగుతుంది. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రవాణా, ఎక్స్‌పోర్ట్, రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులు గురవుతారు. రుణ విముక్తులు కావడంతో తాకట్లు విడిపించుకుంటారు. 
 
కన్య : బంగారు, వెండి, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలివిగా వ్యవరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పువు. రాజకీయ నాయకులు విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు అయినవారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. 
 
తుల : ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృశ్చికం : దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఖర్చులు అధికమవుతాయి. శుభకార్యాలు, ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
ధనస్సు : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయల వారికి పార్టీ పరంగాను, అన్ని విధాలా గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
మకరం : ప్రయత్నపూర్వకంగా మొండిబాకలు వసూలు కాగలవు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. మీ మిత్రుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు లక్ష్యం నెరవేరుతుంది. 
 
కుంభం : హోటల్, తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త వహించండి. 
 
మీనం : చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ సంతానం చదువుల్లో బాగా రాణిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపవాసాలు, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సమయానికి ధనం సర్దుబాటు కాగలదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయకుడి ఆలయంలో గరుడాళ్వార్.. శ్రీపతి కూడా.. ఎక్కడంటే?