Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

16-11-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే...

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 16 నవంబరు 2020 (05:00 IST)
మేషం : ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు ఇబ్బందులను కలిగిస్తాయి. కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల అసహనానికి లోనవుతారు. 
 
వృషభం : వస్త్ర వ్యాపారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే కోరిక పట్టుదలతో సాధించుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిల విషయంలో అప్రమత్తత అవసరం. వాతావరణంలో మార్పు వ్యవసాయ రంగంలోని వారికి ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం : ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చిట్స్, ఫైనాన్స్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. స్త్రీల మాట తీరు కలహాలకు దారితీస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. 
 
కర్కాటకం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
సింహం : ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగాలి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు.
 
కన్య : పాత రుణాలు తీరుస్తారు. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలు, బంధువర్గంలో సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి పురోభివృద్ధి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. 
 
తుల : మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ప్రకటనలు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు ప్రయత్నించకండి. విద్యార్థినుల తొందరపాటుతనం వల్ల చికాకులు తప్పవు. అవివాహిత యువకులతో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
వృశ్చికం : రాజకీయ నాయకులకు ఒక విషయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. హోదా పెరగడంతో పాటు బాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం. ఉద్యోగ లేఖ అందుతాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. పొదుపు పథకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించిన ఓ సమాచారం కలవర పెడుతుంది. వైద్య సేవలకు అవసరమైన నగదు సమకూరుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు ఉపవాసం, దైవ కార్యాల్లో హడావుడిగా ఉంటారు. వ్యాపారస్తులకు సమిష్టి కృషి వల్ల జయం పొందుతారు. 
 
మకరం : పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీల అతిథి మర్యాదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు ఫైనాన్సుల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం మంచిదికాదు. సాహసకృత్యాలు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ప్రమేయంతో ఆస్తి వివాదాలు, గృహంలో చికాకులు ఒక కొలిక్కివస్తాయి. 
 
కుంభం : స్త్రీలు కాళ్లు, తల నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలో చెక్కుల జారీలో వ్యాపార వర్గాలకు పునరాలోచన అవసరం. మీరెంతగానో ఆందోళన చెందిన ఒక సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. 
 
మీనం : రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిత్యావసర వస్తువులకు స్టాకిస్టులకు గుప్త విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. దైవకార్యాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. వేళ తప్పి ఆహారం భుజించుట వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-11-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే..?