Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

13-03-2021 శనివారం దినఫలాలు - ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే...

Advertiesment
Daily Horoscope
, శనివారం, 13 మార్చి 2021 (04:00 IST)
మేషం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో లౌక్యం అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో యత్నాలు సాగిస్తారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. 
 
వృషభం : వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు అర్జిస్తారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు సామాన్యం. 
 
మిథునం : ఉద్యోగస్తుల ప్రమేషన్‌కు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. కోర్టు వ్యవహారాల్లో క్లయింట్ల తీరు చికాకు కలిగిస్తుంది. సన్నిహితులతో ఒక పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. మీ గౌరవ, ఆత్మాభిమానాలు భంగం కలింగే సూచనలున్నాయి. 
 
కర్కాటకం : వ్యాపార వర్గాల వారికి పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. విదేశాలకు వెళ్లడానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులు క్రింది స్థాయి పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు పూర్తికాక విసుగు కలిగిస్తాయి. 
 
సింహం : దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. 
 
కన్య : పత్రికా సంస్థలలోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఉపాధ్యాయులకు మార్పులు, అనుకూలిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : చేపట్టన పనులు పూర్తికాక నిరుత్సాహం చెందుతారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవ దర్శనాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు, ట్యాక్స్ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు యాజమాన్యం ఒత్తిడి అధికం కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంపరించుకుంటారు. 
 
వృశ్చికం : వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి లాభదాయకం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. వ్యవహార దక్షితతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. 
 
ధనస్సు : బంధువుల రాకపోకల వల్ల ఖర్చులు అధికమవుతాయి. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలోని వారికి చికాకులు తప్పవు. బిల్లులు చెల్లిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందుతుంది. ధనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
మకరం : భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రావలసిన బకాయిల విషయంలో శ్రద్ధ వహించండి. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. 
 
కుంభం : చేపట్టిన పనులలో స్త్రీలు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కొంటారు. బంధువర్గాల నుంచి వ్యతిరేక, విమర్శలు ఎదుర్కొంటారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి లాభదాయకం. రుణాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
 
మీనం : విలాసాల కోసం ధన వ్యయం చేస్తారు. రుణం కొంత అయినా తీర్చగలుగుతారు. మీ విషయాలలో జోక్యం చికాకు పరుస్తుంది. నూతన ప్రదేశాల సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాదు. ఉద్యోగస్తులకు కిందివారితో మాట పట్టింపులు అధికమవుతుంది. కోళ్ల, మత్స్య, గొర్రె, పాడి వ్యాపారులకు ఆశాజనకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమకు కొసరి కొసరి వడ్డించిన సీత.. హనుమలో శంకరుడు ఎలా..?