Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

10-03-2021 బుధవారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ఆరాధించినా...

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 10 మార్చి 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుండరన్న వాస్తవం గ్రహించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. నూతన టెండర్లు ఆశించినంత సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. 
 
వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. అనువు కాని చోట ఆధిపత్యం చెలాయించడం మంచిదికాదు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. 
 
మిథునం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ప్రత్యేక ఇంక్రిమెంట్ వంటి శుభపరిణామాలు ఉన్నాయి. స్త్రీలకు కొనుగోళ్లు, చెల్లింపులు విషయంలో ఏకాగ్రత ముఖ్యం. ఒక అవకాశం చేజారిపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. 
 
కర్కాటకం : వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు అనుభవం గడిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేయడం మంచిదికాదు. క్యాటరింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల కష్టానికి సమర్థతకు ఏమాత్రం గుర్తింపు ఉండదు. మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కూడదు. 
 
సింహం : మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి, తరచూ పర్యటనలు తప్పవు. పత్రికా సంస్థలలోని వారికి తోటివారి వల్ల చికాకులు తప్పవు. మీ యత్నాలు గోప్యంగా సాగించండి. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కన్య : వృత్తి వ్యాపారాల్లో స్థిరపడతారు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. వాహనం ఏకాగ్రతతో నపడటం వల్ల శ్రేయస్కరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. గట్టిగా ప్రయత్నిస్తే మొండి బాకీలు వసూలు కాగలవు. స్త్రీల అభిప్రాయాలకు ఆశించినంత స్పందన ఉండదు. ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
తుల :  ఆర్థిక లావాదేవీలు వాణిజ్య ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీ మాటతీరు, పద్దతులు ఎుటివారికి కష్టం కలిగిస్తాయి. మీ శ్రీమతికి మినహా ఇతరులకు తెలియనీయకండి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. 
 
వృశ్చికం : కొన్ని విషయాలు మరచిపోదామనుకున్నా సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వ్యక్తులకు కీలకమైన బాధ్యతలు అప్పగించడ మంచిదికాదు. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారులతో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగవు. పాత, కొత్త ఆలోచనలు మధ్య సతమతమవుతూ నలిగిపోతుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. 
 
మకరం : మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
కుంభం : స్త్రీలకు అయినవారిని చూడాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీపై శకునాలు, చెప్పుడు మాటల తీవ్ర ప్రభావం చూపుతాయి. నూతన పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి. ఇతరులతో సంబంధం లేకుండా మీ పనిలో మీరు నిమగ్నలవుతారు. 
 
మీనం : బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వ్యాపారాలు, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులు అయినవారిని కలుసుకుంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఆశాజనకం. గతాన్ని గుర్తించి ముందడుగు వేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహా శివరాత్రి : విభూతి తయారు చేస్తారట.. గుణనిధి కథ తెలిస్తే..?