Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Breastfeeding week 2021: పాలిచ్చేటపుడు తల్లికి కలిగే ఇబ్బందులేంటి?

Advertiesment
Breastfeeding week 2021: పాలిచ్చేటపుడు తల్లికి కలిగే ఇబ్బందులేంటి?
, గురువారం, 5 ఆగస్టు 2021 (22:25 IST)
తల్లిపాలు శిశువుకి అత్యంత సహజమైన పోషకాహారం. ఈ పాలు బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలను సరైన నిష్పత్తిలో సరఫరా చేస్తాయి. అలెర్జీలు, అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా, మానవులతో పాటు ఇతర క్షీరదాలన్నీ తల్లి పాలివ్వడం ద్వారా తమ పిల్లలను పోషిస్తూ వస్తున్నాయి.

కానీ నేటికీ, తల్లి పాలివ్వడం చుట్టూ ఓ రకమైన ఇబ్బంది వుంది. అలా తల్లి పాలివ్వడం అనేది సమాజంలో తరచుగా ఆమోదయోగ్యం కానిదిగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇది బహిరంగ ప్రదేశంలో తల్లి బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు.
 
బేబీ ప్రొడక్ట్ బ్రాండ్ టామీ టిప్పీ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయాలు ఇలా వున్నాయి. పాలిచ్చే తల్లుల గురించి కలత పెట్టే గణాంకాలను వెల్లడయ్యాయి. బహిరంగంగా తల్లి పాలివ్వడంలో ప్రతి ఆరుగురిలో ఒకరు అవాంఛిత లైంగిక దృష్టిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.
 
26 శాతం మంది తమ బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు అపరిచితులతో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 27 శాతం మంది మహిళలకు మరో ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే... తాము తల్లిపాలు వేరే ప్రాంతాలకు వెళ్లి ఇవ్వమని చెప్పడం.
 
 ఇక 10 మందిలో ఒకరికి మరో రకమైన అనుభవం ఏంటంటే... బిడ్డకు పాలు ఇచ్చేటపుడు ఎద భాగాన్ని కప్పుకుని పాలివ్వాలన్నది. అదనంగా, మరో ఎనిమిది శాతం మంది మహిళలు తమ బిడ్డకు పాలిచ్చేటప్పుడు అవాంఛిత లైంగిక దృష్టిని, అలాంటి వ్యాఖ్యల రూపంలో పొందారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు మారాలనీ, తన బిడ్డకు పాలు ఇచ్చేటపుడు తల్లి ఎదుర్కొనే ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్‌ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు బూస్టర్‌ డోస్‌లు అందిస్తున్న హీల్ఫా హెల్త్‌ ఏటీఎంలు