Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రలేవగానే చేయాల్సిన పనుల జాబితా...?

Advertiesment
నిద్రలేవగానే చేయాల్సిన పనుల జాబితా...?
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:26 IST)
వేగవంతంగా మారిన జీవితంలో ఉదయం నిద్రలేచిన తొలి క్షణాల్లో బద్దకాన్ని కాస్త విడనాడి హుషారుగా వుంటే ఆ రోజంతా దినవారీ కార్యక్రమాలను చలాకీగా నిర్వహించుకోవచ్చు. నిద్రలేచినప్పటినుంచి ఇంటి పనులు, పిల్లల ముస్తాబు, ఆఫీసుకు పరుగెత్తడం వంటి పలురకాల హైరానాలకు గురవుతూ సతమతమయ్యే మహిళలు కొందరైతే నింపాదిగా పనులు చేసుకుపోయే వారు మరికొందరు. 
 
కాగా సమయానికి ఏ పనీ కాదేమోనని ఆలోచనలలో పడిపోయి రక్తపోటు పెంచుకునేవారు ఇంకొందరు. ఇలాంటి జీవన శైలికి అలవాటు పడిన వారు నిద్రలేచి ఇంటిపనులు పూర్తి చేసుకుని బైటికి వెళ్లేముందు ప్రశాంతంగా కొన్ని పనులు పూర్తి ముగిస్తే ఉల్లాసం, ఉత్సాహం, మీ సొంతం అవుతాయి.
 
1. ఒళ్ళెరగకుండా నిద్రపోయి గాభరా పడేవారు ఉదయ సూర్యకాంతులు శరీరానికి నేరుగా తగిలేలా పడకగదిని అమర్చుకుంటే ప్రతిరోజూ కాంతి సోకగానే లేవడం అలవాటవుతుంది. అలా వీల్లేదంటే లైట్‌ అమర్చివున్న అలారంను బెడ్‌ రూమ్‌లో అమర్చుకుంటే చాలు.
 
2. నిద్రలేవగానే చేయాల్సిన పనుల జాబితా గుర్తుకొచ్చి హడావిడిగా లేవడం కాకుండా పడకమీదే శరీరాన్ని సాగదీయాలి. దీంతో విశ్రాంతి తీసుకుని బిగుతు అయిన కండరాలు పట్టు సడలి రక్త ప్రసరణ చైతన్యవంతమవుతుంది. 
 
3. శరీరం మొత్తాన్ని అంటే కాళ్ళు, చేతులు, వీపు, ఉదరం అన్ని అంగాలూ కదిలేలా శరీరం బలంగా విరుచుకోవాలి. తర్వాత లేచినిలబడి ముంజేతులను పైకి ఎత్తి వ్యతిరేక దిశలో ఓ పదిసార్లు గుండ్రంగా తిప్పితే శరీరం ఉత్సాహభరితం అవుతుంది.
 
4. నిద్రలేచిన వెంటనే నిస్సత్తువుగా పట్టులేనట్టుగా వుండే శరీరం తిరిగి శక్తిని సంతరించుకోవాలంటే ద్రవపదార్థాలు బాగా అవసరం కాబట్టి లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిలో రెండు చెంచాల తేనె, ఒక నిమ్మకాయ రసం తాగితే ఆహారం అన్నవాహికలోగి దిగడానికి తోడ్పడే కండర చలనాన్ని ఆరంభించినట్లవుతుంది. అంటే మరో కొత్త రోజులో ఉత్సాహంగా పని చేయటానికి శరీరాన్ని సిద్దం చేసినట్టవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. యాపిల్ తిని కుర్చీకే పరిమితమైన చిన్నారి?