Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏసీ, కూలర్లు లేకుండా.. ఇంటిని చల్లగా ఉంచడం ఎలా..?

Advertiesment
ఏసీ, కూలర్లు లేకుండా.. ఇంటిని చల్లగా ఉంచడం ఎలా..?
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:10 IST)
కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. ఈ ఉష్ణోగ్రత కారణంగా వాతావరణంలో వేడికూడా ఎక్కువైపోతుంది. ఈ వేడి నుండి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు వాడుతుంటారు. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతో పాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు కూడా భరించాల్సి ఉంటుంది.

పేదలు, మధ్యతరగతి వారు ఏసీలు, కూలర్లు కొనలేరు... అలాంటివారు అదనపు ఖర్చు లేకుండా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. వాటి వలన ఇంట్లో చల్లదనంతోపాటు ఫ్యాన్స్, కూలర్స్, ఏసీల వాడకం కూడా తగ్గుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం..
 
ఒకే అంతస్తు ఉంటే వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్స్ సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువలన పైకప్పు బాగా వేడెక్కి ఆ వేడి ఇంట్లోకి వస్తుంది. ఇలా వేడెక్కి ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వినియోగించడం వలన ఫ్యాస్ పైకప్పు వేడిని గదిలోకి విడుదల చేసి.. వేడి మరింత పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. పైకప్పు పైన నేరుగా ఎండ పడే ప్రాంతంలో కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేస్తే సరిపోతుంది.
 
ఇంట్లో కిటికీలు, తలుపులు వద్ద తెరచాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వలన ఇంట్లోకి వేడి గాలి రాకుండా ఉంటుంది. ఈ చాపలు వేడిని తగ్గిస్తాయి. ఇంట్లోకి గాలి వీచే స్థలాల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు ఏర్పాటు చేసి వాటిని కొంత నీటితో తడుపుతూ ఉండడం వలన ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలపాలు, మట్టి, బియ్యం తింటున్నారంటే... అది వున్నట్లే...