Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల్లో ఇరెగ్యులర్ పీరియడ్స్, కారణాలు ఏంటి?

మహిళల్లో ఇరెగ్యులర్ పీరియడ్స్, కారణాలు ఏంటి?
, శనివారం, 25 జులై 2020 (15:59 IST)
మహిళల్లో పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తుంటే అది వారి మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అయితే అవి ఆలస్యంగా లేదా సక్రమంగా రాకుంటే దానికి చాలా కారణాలు ఉండవచ్చు. అధిక బరువు పెరగడం కూడా పీరియడ్స్ ఆలస్యం కావడానికి ఒక కారణం కావచ్చు. ఇది కాకుండా, ఇతర కారణాలు ఏమిటో చూద్దాం
 
1. తక్కువ లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో రుతుస్రావం ప్రారంభంలో తరచుగా అవకతవకలకు కారణమవుతుంది, ఇది సాధారణం. కాలక్రమేణా ఇది రెగ్యులర్‌గా వస్తుంది, కాబట్టి ఆందోళన చెందడానికి ఏమీ లేదు.
 
2. అధిక బరువు పెరగడం లేదా ఊబకాయం కూడా రుతుస్రావం అవకతవకలకు ప్రధాన కారణం. కొన్నిసార్లు ఈ సమస్య థైరాయిడ్ వల్ల వస్తుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం అవసరం.
 
3. దినచర్యలో మార్పు, తినే ఆహారం కారణంగా చాలాసార్లు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. అలాంటి పద్ధతులను సరిదిద్దుకుని మీరు మీ జీవనశైలి, తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే రుతుక్రమం సరైన సమయంలో వచ్చేవిధంగా చేసుకోవచ్చు.
 
4. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ రుతుస్రావం ఆలస్యం కావడానికి కారణం కావచ్చు. కాబట్టి ఇది పైన ఇచ్చిన కారణాలు కాకుండా వేరేగా వున్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.
 
5. ఒత్తిడి, అధిక వ్యాయామం కూడా రుతుస్రావాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారణాల్లో ఒకటి. ఇది తరచుగా అండాశయంపై తిత్తి వల్ల కూడా వస్తుంది. కనుక ప్రశాంతంగా వుండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచిర్యాల టూ అమెరికా, సింగరేణి బిడ్డ ఘనత